*”రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన”- కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా*
*తేది:20-01-2025*
*నెల్లూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం వాళ్ల దాడిలో గాయాలపాలై, చికిత్స పొందుతున్న ముత్తుకూరు మండల బిట్-2 ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లును పరామర్శించి, వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*మాజీ మంత్రి కాకాణి కామెంట్స్:*
👉ఆంధ్రరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిత్యం దాడులు, విధ్వంసాలు ప్రజలని అన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తూ, విధ్వంస పాలనకి శ్రీకారం చుట్టడం జరిగింది.
👉 రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
👉 రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, వాళ్ల ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ల భూములను ఆక్రమించడం, ప్రశ్నించినటువంటి వారి మీద దౌర్జన్యం చేయడం, అరాచకాలను అడ్డుకున్న వ్యక్తులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు.
👉 కూటమి ప్రభుత్వ తీరు చూస్తుంటే, మేము దాడులు చేస్తాం, మేము విధ్వంసపాలన కొనసాగిస్తాం, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతాం అన్నట్లుగా పాలన సాగిస్తున్నారు.
👉నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు బిట్-2 ఎంపిటీసి వెంకటేశ్వర్లు మీద హత్యా ప్రయత్నం జరిగింది.
👉వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఎంపిటీసి గా గెలుపొందినటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడిచేయడం అనేటువంటిది దారుణం.
👉 దాడిలో వెంకటేశ్వర్లు కు తల మీద నాలుగు కుట్లు పడ్డాయి, తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది తొంటె విరిగిపోయింది, ఈరోజు డాక్టర్లు దానికి సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది.
👉నిన్న సాయంకాలం దాడి జరిగితే ఉదయం వచ్చి పోలీసులు విచారించారు తప్ప, ఇంతవరకు నిందితుడ్ని అదుపులోకి తీసుకోలేదు.
👉 వారి పరిస్థితి చూస్తే నామమాత్రపు కేసులు పెట్టి, వదిలివేస్తారా! అనే అనుమానం ఉంది.
👉పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారు తప్ప చట్టబద్ధంగా వ్యవహరించడం లేదు.
👉 నేను జిల్లా ఎస్పీ గారికి చెప్పేది, ఇదే పందా కొనసాగితే, జిల్లాలో రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన గనుక కొనసాగితే, గ్రామాల్లో శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతాయి.
👉 అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా చేస్తూ, విర్రవీగితే ఈరోజు మీరు పాపాలకు పాల్పడితే, ఆ పాపాలు శాపాల్లాగా మీకు వెంటాడుతాయి.
👉రేపు మరలా ఈ రాష్ట్రంలో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా, సార్వత్రికఎన్నికల కౌంటింగ్ ట్రెండింగ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా కూటమి నేతలు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండవు, ఎక్కడ వాళ్ళు అక్కడ పరారు అవుతారు.
👉 మీరు ఉండి ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్లు కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈరోజు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి తప్ప పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే, భవిష్యత్తులో మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
👉 ఏడు నెలల్లోనే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామా !, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దెని ఎక్కించామా! ఎందుకు ఈ విధంగా బ్రతుకులను బుగ్గిచేసుకున్నామా! అనేటువంటి బాధ ప్రజల్లో ఉంది.
👉 ఖచ్చితంగా ఈసారి, 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని, కూటమిని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
👉 అన్యాయాలు, అక్రమాలు జరిగినా పోలీసు అధికారులు సరియైన కేసులు పెట్టకుండా, ఉదాసీనంగా వ్యవహరించినటువంటి కేసులను మరలా విచారణ జరిపించి, నిందితులను శిక్షించడంతో పాటు బాధ్యులైనటువంటి వ్యక్తులను, సహకరించిన అధికారులను విడిచిపెట్టేది ఉండదు.
👉 పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనటువంటి నేపధ్యంలో తప్పనిసరిగా ప్రైవేట్ కేసులు వేసి, చట్టం ప్రకారం న్యాయ పోరాటం చేస్తాం.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు మీకు అండగా నిలిచి, మీకోసం పోరాడేందుకు మీ వెంట నిలబడేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
👉 జగనన్న మరలా ముఖ్యమంత్రిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు, మంచి భవిష్యత్తు ముందుంది ఎవరూ అధైర్యపడవద్దు.
👉 నేడు కూటమి నేతలు చేసే ఆరాచకాలకు రేపు తిరిగి భారీ మూల్యం చెల్లించుకోవల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి, వాళ్ళకి సహకరిస్తున్న అధికారులకి ఏర్పడుతుంది.