*రెడ్ క్రాస్  విషయంలో న్యాయం గెలిచింది….*

*పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఐదుగురు  మేనేజ్మెంట్ కమిటీ  సభ్యులకు  హైకోర్టులో దక్కిన విజయం*
—————————————-
నిన్నటి రోజున 21-01-2025 జిల్లా కలెక్టర్ గారు రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీలోని ఐదుగురిని రాజకీయ ( వైస్సార్సీపీ తో) సంబంధాలు ఉన్నాయన్న కారణంతో *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి, దామిశెట్టి సుదీర్ నాయుడు, గ్రంధం ప్రసన్నఆంజనేయులు* ల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులుగా తొలగించడమే కాకుండా వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది.

ఈ విషయం పై కలెక్టర్ గారిచ్చిన ఆర్డర్ ను ఈ రోజున అనగా  23-01-2025 తేదీన  వారు గౌరవ హైకోర్టు ను ఆశ్రయించగా.. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్  లో విచారణకు స్వీకరించింది.

మొత్తం రెండు అంశాలపై హైకోర్టును ఆశ్రయించడం జరిగినది.

1. ప్రాథమిక సభ్యత్వం రద్దు ఎత్తివేయడం , మేనేజ్మెంట్ కమిటీ సభ్యులుగా ఐదు మందిని కొనసాగించాలని కోరడం

2. నేడు హడావుడిగా నిర్వహించిన నూతన రెడ్ క్రాస్ చైర్మన్ ఎన్నికను నిలుపుదలకు చేయాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లడం జరిగినది.

👉 అయితే మొదటి అంశంలో భాగంగా ప్రాథమిక సభ్యత్వాన్ని కొనసాగిస్తూ.. మేనేజ్మెంట్ కమిటీలో సభ్యులుగా కొనసాగించాలని _జిల్లా కలెక్టర్ ఆదేశాలు పై_ స్టేఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

14 రోజుల తర్వాత ఫర్దర్ హియరింగ్ కు అవకాశం కల్పించింది.

హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఫలితంగా  ఆ  ఐదుగురు సభ్యుల ప్రాథమిక సభ్యత్వంతో పాటు.. వారు మేనేజ్మెంట్ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు.

👉 ఇక రెండో అంశంలో భాగంగా హడావిడిగా ఈ రోజు చెపట్టిన చైర్మన్ ఎన్నిక వాయిదా వేయమని కోరగా.. అందుకు సంబంధించి 14 రోజుల తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని.. అలానే నూతన చైర్మన్ ఎన్నిక  హై కోర్ట్ ఉత్తర్వలకు లోబడి ఫలితాలు ఉంటాయని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *