రెండోసారి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డి
నెల్లూరు: నెల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో వంశీధర్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ పదవికి రెండోసారి మద్దతు తెలిపిన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడం నా ప్రధాన లక్ష్యం. మోదీ నాయకత్వంలో పార్టీని మరింత బలపర్చడానికి నా శక్తిమేరకు కృషి చేస్తాను” అని తెలిపారు. ప్రజాసేవకు ఇది తన రెండో ఇన్నింగ్స్ అని, ప్రతి కార్యకర్త, నాయకులతో కలిసి పార్టీ శ్రేయస్సు కోసం సమష్టిగా పని చేస్తానని చెప్పారు.
సమావేశం అనంతరం నాయకులు, కార్యకర్తలు వంశీధర్ రెడ్డిని పూలమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం నుండి వి.ఆర్.సి. సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. విఆర్సి సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వంశీధర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్థగత ఎన్నికల అధికారి వల్లూరు జయప్రకాష్, డిఆర్ఓ రొంగల గోపి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్, కమల, రఘునాథరాజు, ఆంజనేయ రెడ్డి,జిల్లా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంతి రెడ్డి, పెంచలయ్య,నారాయణరెడ్డి, రాధాకృష్ణారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి యరబోలు రాజేష్, గడ్డం విజయకుమార్, యశ్వంత్ సింగ్ , జిల్లా కార్యదర్శులు దాసరి ప్రసాద్ ,పరశురాం ,చిలకా ప్రవీణ్ విజయలక్ష్మి, మీడియా ప్యానలిస్ట్ భాస్కర్ గౌడ్ నెల్లూరు రూరల్ కన్వీనర్ మoడ్ల ఈశ్వరయ్య, కోవూరు నియోజకవర్గం కన్వీనర్ ఇండ్ల రాఘవేంద్ర,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషిని, ప్రవీణ రెడ్డి, గంటా విజయ్ శ్రీ,, మూలాపేట మండల అధ్యక్షురాలు చిత్తాతూరు పద్మావతి, మళ్లీ రవి, గుంజి శ్రీనివాసులు, సుధీర్, నాగలక్ష్మి పైడిమాని సృజన , హర్ష, మారం విజయలక్ష్మి, సోషల్ మీడియా కన్వీనర్, ముని సురేష్ పిడుగు లోకేష్,తదితరులు పాల్గొన్నారు.
ఆటో కార్మికుల అభినందన
వంశీధర్ రెడ్డి రెండోసారి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లోని ఆటో డ్రైవర్లు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సన్మానం చేసి, “వంశీధర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు.