రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికలలో డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానకర రీతిలో “ఓడించిన చరిత్ర” కాంగ్రెస్ పార్టీది!
గత 60 సంవత్సరాలుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అనేక రకాలుగా అవమానించిన “కాంగ్రెస్” పార్టీ.. గతవారం పార్లమెంట్ లో చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలను వక్రీకరించి, డాక్టర్ అంబేద్కర్ గారిని మళ్లీ మళ్లీ “అవమానించిన విధానానికి” వ్యతిరేకంగా ఈరోజు నెల్లూరు వి ఆర్ సి సెంటర్ లోని డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు “నిరసన” తెలియజేసి..విగ్రహానికి “పాలాభిషేకం” చేసి “పుష్పాంజలి” సమర్పించడం జరిగింది!
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(sc morcha) “బైరి శ్రీనివాస్” మరియు రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి కందికట్ల మాట్లాడుతూ..
రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికలలో డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానకర రీతిలో “ఓడించిన చరిత్ర” కాంగ్రెస్ పార్టీది!
దేశానికి ఎనలేని సేవ చేసిన డాక్టర్ అంబేద్కర్ గారికి “భారతరత్న” ఇవ్వకుండా “అవమానించిన చరిత్ర” కాంగ్రెస్ పార్టీది!
అలాంటి నీచ సంస్కృతి, చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించే నైతిక హక్కు లేదని తెలిపారు!
” డాక్టర్ అంబేద్కర్ గారి పేరును తమ యొక్క నీచ రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు”
2014 లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన “నరేంద్ర మోడి” గారు మొదటిసారి పార్లమెంట్లో మాట్లాడుతూ.. నాలాంటి వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి భారతదేశానికి ప్రధాన మంత్రి అయ్యాడంటే ,ఆ గొప్పతనం డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన “రాజ్యాంగానికి దక్కుతుందని”తెలిపారు!
డాక్టర్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడిన ఐదు ప్రాంతాలను “పంచ తీర్ధాలు”గా అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడి గారికి, బిజెపి దక్కుతుందని పేర్కొన్నారు!
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(sc morcha) బైరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి కందికట్ల, ఎస్సి మోర్చా అధ్యక్షులు పరుశు మధు, జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాసులు,BJYM జిల్లా అధ్యక్షులు అశోక్,నాయకులు రాములు, మదన్,రఘురామయ్య, సుబ్బారావ్, మస్తాన్ గౌడ్,కిషోర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు!