*రూరల్ భారీ మెజారిటీతో నాన్నగారు ఘన విజయం ఖాయం — ఆదాల హిమబిందు*
*ప్రజలు వైసీపీ వైపు మొగ్గు — ఆదాల హిమబిందు*
*ప్రజల గుండెల్లో నాన్నగారికి చెరగని ముద్ర — ఆదాల హిమబిందు*
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్నగారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన కుమార్తె ఆదాల హిమబిందు ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించే తత్వమున్న నాన్నగారు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆదాల హిమబిందు చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ వస్తుందని ఆమె ఆశభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 37వ డివిజన్లోని మాగుంట లేఔట్ అపార్ట్మెంట్స్ లో గడపగడప ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చిరునవ్వుతో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఈనెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో *నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు* ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమవంతుగా సహకారం అందించాలని ఆదాల హిమబిందు కోరారు. *ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తమకు ప్రేమానురాగాలు పంచి ఆదరించిన రూరల్ నియోజకవర్గం ప్రజలకు మా కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆదాల హిమబిందు చెప్పారు*. సంక్షేమం అభివృద్ధి రెండు కొనసాగాలంటే మే 13వ తేదీ జరగనున్న సాధారణ ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిగార్లను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆదాల హిమబిందు ప్రజలను కోరారు.
*నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి దిశా నిర్దేశంలో* ఆదాల హిమబిందు చేపడుతున్న ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక 37వ వైస్సార్సీపీ డివిజన్ నాయకులు అనీల్, ఆనంద్, వెంకటేశ్వర్లు, గోపి, ప్రసాద్ రెడ్డి, కోటారెడ్డి, మునీర్ సిద్ధిక్, విజయకుమార్ రెడ్డి, దయాకర్ రెడ్డి, శివ, భరత్, శ్రీకాంత్, వెంకట్ చిన్న, తదితరులతోపాటు యువనాయకులు కొండ్రెడ్డి భరత్ కుమార్, ఏపీ స్టేట్ ఎంఎస్ఎమ్ఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీసునంద, నగర పార్టీ ఉపాధ్యక్షుడు వేలూరు శ్రీధర్ రెడ్డి, టిఎల్ఎఫ్ అధ్యక్షులు హరితరెడ్డి, భార్గవిరెడ్డి, రోజారాణి, పాశం వెంకటేష్ స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.