*రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్యలతో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి భేటి*
పెన్నా డెల్టా ఛైర్మన్ గా ఎన్నికైన జెట్టి రాజగోపాల్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి గార్లను మర్యాద పూర్వకంగా కలిశారు. రైతుల సమస్యల పై అవగాహన వున్న రాజగోపాల్ రెడ్డి పెన్నా డెల్టా ఛైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికైన కావడం ఎమ్మెల్యే జెట్టి రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణా రెడ్డి గార్లు అభినందించారు. పెన్నా డెల్టా పరిధిలోని సాగునీటి కాలువల ఆధునీకరణకు కృషి చేయాలని సూచించారు. ఆయకట్టు రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణా రెడ్డి గార్లను కలిసిన వారిలో టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, టిడిపి యువ నాయకులు బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి వున్నారు.