
*రాష్ట్రాభివృధే లక్ష్యంగా ఢిల్లీలో వివిధ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి సాదర స్వాగతం పలికిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో లోకేష్ గారిని కలిసి వారికి ఆహ్వానం పలికారు.
రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు, ఇతర అంశాలపై నారా లోకేష్ గారు కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నారు.
కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు.. టీడీపీ ఎంపీలతో సోమవారం రాత్రి భేటీ అయ్యారు.
ఈ భేటీలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,
ఇతర ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు, ఇతర ఎంపీలతో భేటీ అయిన నారా లోకేష్.. రేపు కేంద్ర మంత్రులతో చర్చించాల్సిన అంశాలపై వారితో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులు, ఇతరాలపై వారితో చర్చించారు.