*రాష్ట్రపతి ప్రశంసలు పొందిన వి ఎస్ యూ విద్యార్థులు…*
…………
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రతిష్టాత్మక గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల ప్రశంసలు పొందడం విశ్వ విద్యాలయానికి గర్వకారణమని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్ విజయ భాస్కర రావు అన్నారు. విశ్వవిద్యాలయం నుంచి రిపబ్లిక్ డే పరేడ్ చేసిన ఫుడ్ టెక్నాలజీ విద్యార్థిని ఎల్. తేజస్వి మరియు వేడుకలను వీక్షిం చేందుకు వెళ్లిన ఎం. షాలిని, బి.యుగంధర్, బుధవారం ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ శంకర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులు వర్సిటీకి వన్నె తెచ్చేలా ప్రదర్శన చేయడం గర్వకారణమన్నారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత ,వి ఎస్ యూ కావలి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి వీరారెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి వి సుబ్బారెడ్డి,ఎస్ బి సాయినాథ్ పాల్గొన్నారు.