*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి*
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు శ్రీ రాజ్నాథ్ సింగ్, శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.