• *రాష్ట్రం లో రాబోయేది ఎన్.డి.ఎ. ప్రభుత్వమే.*
  • *ఎన్.డి.ఎ. కూటమికి 130 కి పైగా సీట్లు వస్తాయని అన్ని సర్వేలు తేల్చాయి, 2 రోజులుగా వైసీపీ నేతల స్వరం గమనిస్తే సీట్లు మించే అవకాశం ఉందనిపిస్తోంది.*

*పోలీసుల తీరు ఇప్పటికీ మారలేదు, అధికారులమనే విషయం వారు ఏనాడో మరిచిపోయారు.*

*స్ట్రాంగ్ రూమ్ వద్దకు సమ్మెటలు, రాడ్ల తో 100 మంది వైసీపీ రౌడీలు ఎలా రాగలిగారు? జూన్ 4 వరకు ఈవీఎమ్ ల రక్షణ బాధ్యత పోలీసులదే..*

*అధికారం చేపట్టాక అభివృద్ది తో వైసీపీ పై ప్రతీకారం తీర్చుకుంటాం.*

*నెల్లూరు జిల్లా లో 80 శాతం పోలింగ్ జరిగింది, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉప్పెన లా తరలి వచ్చిన జిల్లా ఓటర్లకు కృతజ్ఞతలు.*

*బీద రవిచంద్ర యాదవ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*

నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో షేక్ అబ్దుల్ అజీజ్ ,చేజర్ల వెంకటేశ్వర రెడ్డి,Z శివ ప్రసాద్, రూప్ కుమార్ యాదవ్, ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, జన్ని రమణయ్య, కాకర్ల వెంకట్,రవీంద్ర బాబు, హరికృష్ణ,అమ్రుల్లా లతో కలిసి పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్

*ఈ సందర్భంగా మీడియాతో బీద రవిచంద్ర మాట్లాడుతూ…*

స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోటీ చేసిన అభ్యర్ధి వెళ్ళాలన్నా ఎన్నికల చీఫ్ ఏజెంట్ వెళ్ళాలన్నా వంద నిబంధనలు చెప్పే అధికారులు వందలాది మంది వైసీపీ గూండాలు రాడ్లు, సమ్మెటలు తీసుకుని తిరుగుతుంటే ఏం చేస్తున్నారు ?

ఎన్నికల కమీషన్ పరిధిలో పని చేస్తున్నామనే కనీస భయం అధికారుల్లో లేదు. చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భీభత్సం సృష్టించేందుకు వచ్చిన వైసీపీ గూండాలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేక పోయారు?

బాధ్యత గల ఎస్పీ హోదాలో రక్షణ కల్పించాల్సిన అధికారి అదొక చిన్న సంఘటన అని నాని సంయమనం పాటించాలని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర దాకా వందలాది మంది రౌడీలు వచ్చారంటే ఈవీఎమ్ లకు రక్షణ ఎక్కడ?

గూడూరు లోని పోలింగ్ బూత్ లో అభ్యర్ధి మేరిగ మురళి, వైసిపి నేత నరేంద్ర రెడ్డి ల సూచన తో ఎస్సై రామచంద్రా రెడ్డి అనే నాయకుడి ని కొట్టడమే కాక తిరిగి వైసీపీ వారికి అప్పగించడం హేయమైన చర్య.

ఎన్.డి.ఎ. కూటమి గూడూరు అసెంబ్లీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ పై చిల్లకూరు లో వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేస్తే కేసు నమోదు కు సైతం పోలీసులు వెనకడుగు వేశారు.

ఎస్ ఐ అంజిరెడ్డి, సీఐ వేణుగోపాల్ రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి లు పోలీసు యూనిఫాం వేసుకున్న వైసీపీ కార్యకర్తలు.

చింతవరం లో తెలుగుదేశంపార్టీ కాపు నేత గోపాల్ పై దాడి జరిగింది, చనిపోయాడని వైసీపీ గూండాలు వదిలిపోతే కొన ఊపిరి తో నేడు కోలుకుంటున్నారు, ఇంత జరిగినా ఎలాంటి కేసు నమోదు కాలేదు.

ఉదయగిరి టీడీపీ అభ్యర్ధి కాకర్ల సురేష్ ను పలుచోట్ల రౌడీ షీటర్ లు, వైసీపీ కార్యకర్తలు బెదిరించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీస స్పందన లేదు.

అల్లూరు మండలం, బీరంగుంట పంచాయతీ టీడీపీ నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాసులు పై వైసీపీ రౌడీలు దాడి చేస్తే 324 కేసుతో సరిపెట్టి చేతులు దులుపుకున్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లో పోలీసులు మెలిగారు.

ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ చేస్తున్న దాడుల పై, నిబంధనల అతిక్రమణ పై జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా కనీస స్పందన లేదు.

పల్నాడు జిల్లా, మాచర్ల లో పోలింగ్ ప్రారంభం కాకముందే అభ్యర్థులు ఏజెంట్ల పై దాడులు చేసి… ఓటింగ్ సమయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని సజ్జల, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలలో చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు సార్వత్రిక ఎన్నికలలో కొనసాగించి గెలుపు సొంతం చేసుకోవాలని వైసీపీ నాయకులు విఫల ప్రయత్నం చేశారు.

చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేసిన మంత్రి జోగి రమేష్ పై కేసు లేదు, డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేసినట్టు ఆధారాలు ఉన్నా అరెస్టు చేయలేక పోయారు.

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిలోకి వెళ్లి దమ్ముంటే రమ్మని సవాల్ విసిరితే ఆ ఘటన పై చర్యలు లేవు. వైసీపీ మూకల అరాచకాలకు హద్దులు లేవు.

అంగళ్లులో చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి చేయడమే కాక తిరిగి టీడీపీ కార్యకర్తల 400 మంది పై కేసులు పెట్టి రెండు నెలల పాటు వారిని సొంత గ్రామాలకు దూరం చేశారు. ఇలాంటి నేతలు పోలీసింగ్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల లో ఎన్నికల పరిశీలకుల పై దాడులు చేశారు. కార్లు ధ్వంసం చేశారు, అభ్యర్థుల పై హత్యాయత్నం చేశారు.

సార్వత్రిక ఎన్నికలు సాధ్యమయినంత మేర సజావు గా జరిగేందుకు సహకరించిన అధికారులకు, మీడియా మిత్రులకు, ఓటర్లకు ధన్యవాదములు.

పోటీ లో ఉన్న కూటమి అభ్యర్థి గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన జనసేన, భారతీయ జనతా పార్టీ లకు కృతజ్ఞతలు.

వైసీపీ పాలన తో విసిగిపోయి, చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని భావించి యువత, మహిళలు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు.

గత ఐదేళ్లు భయాందోళనలతో పని చేసిన అధికారులు ఇప్పుడు ఒక బాధ్యతగా వ్యవహరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమించారు.

ఎన్ డి ఎ కూటమికి దాదాపు 130 సీట్లు రాబోతున్నాయి. ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు కనీసం 75 సీట్లు వస్తాయని చెప్పుకునేందుకు వెనుకాడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed