రాష్ట్రం లో ఇప్పటికే పలు చోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రజలందరూ తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి.

మనం తీసుకునే చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదం నుంచి రక్షిస్తుంది.

సమస్యలను ఎదుర్కొనేందుకు టిడిపి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో తగు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేసి ఉన్నారు.

– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.

 

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేసులు తక్కువగానే ఉన్నా అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమని, ముందస్తు జాగ్రత్తలతో మన కుటుంబాలను సమాజాన్ని రక్షించవచ్చు అని తెలిపారు. మనం తీసుకునే చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదం నుంచి రక్షిస్తాయని తెలిపారు. ప్రత్యేకంగా గర్భిణీలు, చిన్నపిల్లలు మధుమేహం, ఊపిరితిత్తుల హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని, చేతులను తరచూ సబ్బుతో కడగాలని, ఎల్లప్పుడూ హ్యాండ్ శానిటైజర్ కలిగి ఉండాలని, దగ్గు జలుబు జ్వరం శ్వాస సంబంధిత ఇబ్బందులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరారు. కోవిడ్ పట్ల మన బాధ్యత గల ప్రవర్తనే మన సామాజిక భద్రతకు మార్గం అవుతుందని, ఎవరు భయపడాల్సిన పనిలేదని, అప్రమత్తతతో ఉండటమే గొప్ప ఆయుధం అని తెలిపారు. సమస్యలను ఎదుర్కొనేందుకు టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో తగు జాగ్రత్తలు ఏర్పాట్లు చేసి ఉన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed