*రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలవారిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరు తారక రామారావుగారికే దక్కుతుంది : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

 

తెలుగు ఖ్యాతి తెలుగుదేశం పార్టీ

– ఘనంగా 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
– బడుగు బలహీన వర్గాల పెన్నిది ఎన్‌టీఆర్‌
– ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారధ్యంలో రాష్ట్రంలో సుపరిపాలన

*రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలవారిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరు తారక రామారావుగారికే దక్కుతుంది : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, తాళ్లపాక రమేష్‌రెడ్డి, తాళ్లపాక అనురాధ, భూలక్ష్మి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ముందుగా కార్యాలయంలో ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ఎన్నో ఒడిదుడుకులు. ఎదుర్కొన్నా.. ఇంత బలంగా పార్టీ నిలబడిందంటే అందుకు కార్యకర్తలు, నాయకులు, సమర్థవంతమైన నాయకత్వమే కారణమన్నారు. టీడీపీ ఆవిర్భవించకముందుకు పేదలను ఓట్లు వేసేవారిగానే చూసేవారని, కానీ అన్న ఎన్‌టీఆర్‌ వచ్చిన తర్వాత పేదలే నాయకులుగా ఎదిగారన్నారు. ఆయన ఆశయ సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్‌ గారు కృషి చేస్తున్నారని చెప్పారు. మానవత్వం ఉన్న పార్టీ, కార్యకర్తలకు అండగా నిలిచి, వారికి అక్కున చేర్చుకునే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనే అని ప్రస్తావించారు. ఇటీవల ప్రత్యేక గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed