*రాష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు – వి.పి.ఆర్*
– లక్కరాజుపల్లి, నల్లరాజుపాలెం, రేవూరు, మినగళ్లులో ఆనంతో కలసి వి.పి.ఆర్ ఎన్నికల ప్రచారం
– ఎన్‌డీఏ కూటమిదే విజయం – వేమిరెడ్డి
ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడుగారిని సీఎంగా చేసుకోవాలని నెల్లూరు పార్లమెంట్ ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని ఆయన అన్నారు. అనంతసాగరం మండలంలో ప్రచారంలో భాగంగా లక్కరాజుపల్లి, నల్లరాజుపాలెం, రేవూరు, మినగళ్లు గ్రామాల్లో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారితో కలిసి ప్రచారం చేశారు. గ్రామాల్లో నేతలకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు.
ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు మాట్లాడుతూ… రాష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ది లేదని అన్నారు. ఈసారి ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న యువత గ్రామాలకు వస్తున్నారని, ఇది శుభ సూచికమన్నారు. ఎన్‌డీఏ కూటమి విజయవంతమైన కూటమి అని, తప్పకుండా రేపు అధికారంలోకి వస్తుందన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు అనువజ్ఞులని, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో బాగా తెలుసన్నారు. గతంలో 3600 కోట్లతో ఆత్మకూరులో అభివృద్ధి చేసిన ఘనత ఆనంగారికే దక్కుతుందన్నారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడుగారిని సీఎంగా చేసుకోవాలని, ఆయన సీఎం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆనం గారిని ఎమ్మెల్యేగా, తనను ఎంపీగా ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.