*రామలింగాపురం రేషన్ షాపులో ప్రధాని మోదీకి జేజేలు*
*ఉచిత బియ్యం పథకంపై ప్రజలు ప్రశంసలు*
నెల్లూరు, జూన్ 4:
పేదల ఆకలి తీర్చడంలో ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకం లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు నింపింది. బుధవారం రామలింగాపురం రెండవ వీధిలోని రేషన్ షాపును బీజేపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా, అక్కడ ఉన్న లబ్ధిదారులకు పథకం విశిష్టతల్ని వివరించారు.
ఒక లబ్ధిదారు భావోద్వేగంగా మాట్లాడుతూ:
“మోదీ గారు లేకపోతే మేము ఎలా బతకేదో తెలియదు. ఆకలితో ఉండే మనల్ని ఆయన దేవుడిలా ఆదుకున్నారు,” అన్నారు.
మరొకరయితే:
“ఉచిత బియ్యం వల్ల మాకు నెలవారీ ఖర్చులో చాలా తేడా కనిపిస్తోంది. మోదీ గారికి ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు.
బీజేపీ నేతలు మాట్లాడుతూ, PMGKAY పథకం కేవలం ఆహారం సరఫరా కోసం మాత్రమే కాక, దేశ పౌరుల పట్ల ఉన్న మోదీ గారి ప్రేమ, బాధ్యతాబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. పథకం ద్వారా సామాజిక న్యాయం, ఆహార భద్రత, మరియు పేదల సంక్షేమం ఎంతగానో మెరుగవుతోందని వివరించారు.ఈ సందర్బంగా రామలింగాపురం ప్రాంతంలోని లబ్ధిదారులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
ఈ పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, కోవిడ్-19 సమయంలో ఏర్పడిన సంక్షోభంలో పేదల్ని ఆకలి నుంచి రక్షిస్తూ, ఉచితంగా బియ్యం అందించేలా దేశవ్యాప్తంగా గొప్ప సంక్షేమ చర్య చేపట్టారు. కోట్లాది మంది పౌరుల జీవితాల్లో భరోసాన నింపిందనీ బిజెపి నేతలు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంటా విజయశ్రీ, బిజె ఎంఎం గౌరవ అధ్యక్షులు సుబ్బారావు, మండల ఉపాధ్యక్షులు అవినాష్ నాయుడు, చలువాది కిరణ్ కుమార్ ,సునీతమ్మ,తదితరులు పాల్గొన్నారు.