*రామతీర్ధం బీచ్ పర్యాటక అభివృద్ధికి శ్రీకారం*

కోవూరు నియోజకవర్గంలోని రామతీర్ధం, మైపాడు బీచ్ లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

విడవలూరు మండలంలోని రామతీర్థంలో తరంగ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్ “తరంగ్ రిసార్ట్స్” పేరిట పునః ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

“తరంగ్ రిసార్ట్స్” నిర్వాహకులైన వూటుకూరు వెంకటేశ్వర రావును ఈ సందర్భంగా అభినందించారు.

వీకెండ్స్ సందర్భంగా బీచ్ సందర్శించే పర్యాటకులకు “తరంగ్ రిసార్ట్స్” ప్రయోజనకరంగా వుంటుందన్నారు.

రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న రామతీర్ధం గ్రామం తరంగ్ రిసార్ట్స్ నిర్మాణంతో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు రిసార్ట్ యాజమాన్యాన్ని కోరారు. రిసార్ట్ నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించి రామతీర్ధం పర్యాటక అభివృద్ధిలో భాగస్వాముల కావాలని ఆమె స్థానికులకు చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, టిడిపి మండల అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు, యువ నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, సత్యంరెడ్డి ఆవుల వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *