
*రాత్రి పూట స్వీపింగ్ మిషన్ల ద్వారా జరుగుతున్న రోడ్డు పరిశుభ్రత పనులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కమిషనర్ వై.ఓ.నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక హరినాధపురం ఫ్లైఓవర్ ప్రాంతంలో పర్యటించారు.
రాత్రి పూట స్వీపింగ్ మిషన్ల ద్వారా జరుగుతున్న రోడ్డు పరిశుభ్రత పనులను కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
రాత్రివేళలో వాహనాలకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక బద్ధంగా స్వీపింగ్ మిషన్లను నిర్వహించాలని, అన్ని ప్రాంతాలలోని రోడ్లను ఎండ్ టు ఎండ్ అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్వీపెంగ్ మిషన్ల ద్వారా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేసుకొని, రాత్రి వేళల్లో రోడ్ల పరిశుభ్రత కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.