రాజ్యాంగానికి గౌరవం చూపుతూ ముందుకు సాగాలి – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యరబోలు రాజేష్
నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్, బిజెపి జిల్లా కార్యాలయంలో “గణతంత్ర దినోత్సవవేడుకలుఘనంగానిర్వహించడం జరిగింది. జాతీయ పతాకావిష్కరణ అనంతరం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యరబోలు రాజేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి మానవ హక్కుల పునాదిగా నిలిచిన రోజు అని,మన రాజ్యాంగం ఇచ్చిన విలువలను కాపాడటంలో ప్రతి పౌరుడి బాధ్యత ఉంటుందనీ” అని రాజేష్ అన్నారు.”మన రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా నేర్పింది. వాటిని కచ్చితంగా పాటించాలి,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర సెల్స్ ఇంచార్జ్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ,”ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలనీ, దేశ సమగ్రతకు మద్దతుగా నిలవాలి,” అని పిలుపునిచ్చారు. “బిజెపి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. రైతులు, యువత, గ్రామీణాభివృద్ధి పై మోదీ గారి నేతృత్వంలో అనేక చర్యలు తీసుకుంటున్నాం,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్టి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు,జిల్లా ఉపాధ్యక్షులు పెంచలయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్, కరణం సుభాషిని, కుప్ప ప్రసన్న, అశోక్ నాయుడు , ప్రవీణారెడ్డి,బాలయ్య గౌడ్, ముని సురేష్ ,విజయలక్ష్మి, ఎస్టీ మొర్చ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ , రాములు, మింగ ,కిరణ్, హర్ష,సుబ్బారావు, శివ,చైతు, మస్తాన్ గౌడ్, జివిటి ప్రభాకర్, పునమల్లి రామకృష్ణ, సత్యనారాయణ గురవయ్య,పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.