*రంగనాథస్వామి ఆలయ పూర్వవైభవానికి కృషి*
– రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

– వైకుంఠ ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకోవడం మహదానందం
– రాష్ట్ర ప్రజలందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

 

నెల్లూరు, జనవరి 10 : నెల్లూరులో ఎంతో ప్రాశస్త్యం గల చారిత్రాత్మక ఆలయమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ పూర్వవైభవానికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించి శ్రీ రంగనాథస్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామి, ఆమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రికి వేదపండితులు ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగనాథస్వామి ఆలయంలో గతంలో రకరకలా రంగులు వేశారని, వీటిని తొలగించి గతంలో ఉన్న పురాతన రాతి కట్టడంగానే ఉండేలా చర్యలు చేపడ్తామని చెప్పారు. మంత్రి నారాయణ, ఎంపీలు వేమిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డితో చర్చించి ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆలయ గర్భగుడిలో కూడా కొన్ని పనులు చేయించాలని గమనించినట్లు చెప్పారు. వేద పండితుల సలహాలు, ఆగమశాస్త్రం మేరకు శ్రీ రంగనాథస్వామి ఆలయ పూర్వవైభవానికి కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని తమ తల్లి పేరుతో తమ కుటుంబసభ్యులు ఉభయకర్తలుగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం, స్వామిని ఉత్తరద్వారంలో దర్శించుకోవడం మహదానందం, అదృష్టంగా మంత్రి చెప్పారు. మంత్రి వెంట దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషన్‌ జనార్దన్‌రెడ్డి, ఈవో శ్రీనివాసులురెడ్డి తదితరులు ఉన్నారు.

*రంగనాథస్వామిని దర్శించుకున్న ఎంపీ మాగుంట, ఎస్పీ కృష్ణ కాంత్*
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ దంపతులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రి ఆనం సమక్షంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలతో వీరిని ఆశీర్వదించారు.
…………………………………………..
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు వారిచే జారీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *