*యువత పోరును విజయవంతం చేయండి :- ఆదాల*
మార్చి12వ తారీకున వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
జిల్లా కలెక్టర్ కు మెమరాండం ఇచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కక్ష సాధింపులకు ఇచ్చే ప్రాధాన్యతను పక్కనపెట్టి, ఇప్పటికైనా విద్యార్థుల ఆవేదన చూసి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈనెల12న యువత పోరుబాట కార్యక్రమంలో అన్నివర్గాల వారు పాల్గొని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని మాజీ ఎంపీ ఆదాల కోరారు.
నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం భృతి, ఉద్యోగాలు ఏవీ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.