యువత ఆర్థిక ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలను అమలు పరచండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో నివసిస్తున్న యువతకు ఆర్థికపరమైన ఉన్నతిని చేకూర్చేలా తీసుకోవాల్సిన చర్యలపై విశ్లేషించి, ఉన్నత స్థాయి అవకాశాలను అమలుపరిచేలా పరిశీలించాలని కమిషనర్ సూర్య తేజ అధికారులకు సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా ) ల సంయుక్త ఆధ్వర్యంలో సి – క్లాప్ ( సిటీ లైవ్లీ హుడ్ యాక్షన్ ప్లాన్ ) సమీక్షా సమావేశాన్ని సోమవారం కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్య అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు వివిధ రంగాలలో వారికి అందించవలసిన శిక్షణ తదితర అంశాలపై యాక్షన్ ప్లాన్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు చర్చించారు. యాక్షన్ ప్లాన్ కమిటీ నిర్దేశించిన వివిధ అంశాలను అమలుపరిచే అవకాశాలను పరిశీలించి, వీలున్నంత త్వరగా ప్రణాళికాబద్ధమైన చర్యలను అమలు పరచాలని కమిషనర్ సూచించారు.
ఈ సమావేశంలో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ షాబుద్దీన్ , మెప్మా పీ.డీ. రాధమ్మ,టాస్క్ ఫోర్ కమిటీ సభ్యులు ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, డిప్యూటీ సిటీ ప్లానర్ పద్మజ , బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ కుమార్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ శామ్యూల్, లేబర్ డిపార్ట్మెంట్ అనిల్ కుమార్, మెప్మా పీ.డీ మాధవి, ఎన్.జి.ఓ మదన్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
.