*యువతరం ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించాలి*

– స్వార్ధ రహిత రాజకీయాలకు శ్రీకారం చుడుదాం.
– మంత్రి నారా లోకేష్ స్పూర్తితో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యువకులు రాజకీయాల్లో రాణించాలి.
– కోవూరు నియోజకవర్గ యువతతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి చిట్ ఛాట్.

దేశ భవిషత్తును దిశా నిర్దేశం చేసే శక్తి యువతకు వుందన్నారు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో ఆయన కోవూరు నియోజకవర్గ యువ నాయకులతో భేటీ అయి ప్రజా సమస్యలపై చర్చించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఇంటింటి ప్రచారం చేసి తన తల్లి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన అర్జున్ రెడ్డి గారికి నియోజకవర్గ వ్యాప్తంగా యువతతో మంచి సంబంధాలున్నాయి.వృత్తి రీత్యా డాక్టర్ అయిన అర్జున్ రెడ్డి గారు హైదరాబాదులో వున్నప్పటికీ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో వుంటూ తన తల్లి ప్రశాంతి రెడ్డి గారి ద్వారా స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. నెల్లూరుకు వచ్చిన ప్రతి సారి ఎన్నికల సందర్భంగా తనతో కలిసి పని చేసిన కార్యకర్తలను కలిసి వారి సాధక బాధలతో పాటు స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటారు. ఈ సందర్భంగా యువనేత డాక్టర్ అర్జున్ రెడ్డి గారు కోవూరు, ఇందుకూరు పేట, బుచ్చిరెడ్డి పాళెం, కొడవలూరు, విడవలూరు మండలాల నుంచి వచ్చిన యావతను ఉద్దేశించి మాట్లాడుతూ యువతరం ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
యువత స్వార్ధ రహిత రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యువకులు రాజకీయాల్లో రాణించాలన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన తన తల్లి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని డాక్టర్ అర్జున్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ యువతకు దిశానిదేశం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోవూరు, ఇందుకూరు పేట, బుచ్చిరెడ్డి పాళెం, కొడవలూరు, విడవలూరు టిడిపి మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, బెజవాడ జగదీష్, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఏటూరి శ్రీహరి రెడ్డి టిడిపి నాయకులు మోర్ల మురళి, కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *