*మోంధా తుఫాన్ నష్టాల అంచనాలు సిద్ధం చేయండి*
*జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*

నెల్లూరు, అక్టోబర్ 29 :

భారీ వర్షానంతర పరిస్థితుల్లో వివిధ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాథమిక నివేదికలు తయారు చేయుటలో శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం లో వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ తుఫాన్ అనంతర పరిస్థితి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో గ్రామాల్లో పారిశుద్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

పునరావాస కేంద్రాలలోని వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా వర్షాలకు నానిన పాఠశాలల ప్రహరీ గోడలు, తదితరాల పరిస్థితులను పరిశీలించాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. అలాగే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో కూరగాయలు అమ్మకాలను కొనసాగించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు.

అలాగే రోడ్లు, కల్వర్ట్లు దెబ్బ తిన్న ప్రాంతాలను గుర్తించి నష్టం అంచనాల నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాథమిక నివేదికలు తయారు చేయుటలో ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.

ఈ సమావేశం లో డి ఆర్ ఓ విజయ్ కుమార్, డి పి ఓ శ్రీధర్ రెడ్డి, డి టి సి చందర్, డి ఈ ఓ బాలాజీ రావు, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈలు దేశ్ నాయక్, గంగాధర్, విజయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *