*మేధావుల సదస్సులో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ : లంక దినకర్*
20 సూత్రాల అమలు కమిటీ కార్యక్రమం చైర్మన్ మరియు బిజెపి రాష్ట్రా అధికార ప్రతినిధి లంక దినకర్ గారు నెల్లూరులో నీ రామ్మూర్తి నగర్, వర్చూస బిల్డింగ్ లో జరిగిన మేధావుల సదస్సులో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మొత్తం రూ. 50,65,000 కోట్లు అని తెలిపారు. ఈ బడ్జెట్‌ను మహిళలు, యువత, మధ్య తరగతి, అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించారని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో, రూ. 12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారని, దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ. 1 లక్ష కోట్ల నష్టం వచ్చినా, ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రెండు స్వయం గృహాల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు, 36 రకాల లైఫ్‌సేవింగ్ డ్రగ్స్‌పై కస్టమ్స్ డ్యూటీ రద్దు వంటి ప్రయోజనాలు అందించినట్లు తెలిపారు.
అదేవిధంగా, ఈ బడ్జెట్ అంత్యోదయ స్ఫూర్తితో రూపొందించారని, పథకాలు చివరి వ్యక్తి వరకూ చేరాలన్న ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించారని అన్నారు. ఇది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ అని తెలిపారు.
మూలధన వ్యయాన్ని ఉద్దేశించి, రూ. 10.18 లక్షల కోట్ల పెట్టుబడులతో ఉత్పాదక ఆస్తుల అభివృద్ధికి ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణంగా రూ. 1.50 లక్షల కోట్లు కేటాయించడం శుభపరిణామమని, రాష్ట్రాలు సమన్వయంతో రూ. 25 లక్షల కోట్లు మూలధన వ్యయం చేసే అవకాశముందని తెలిపారు. పట్టణాల అభివృద్ధికి రూ. 1 లక్ష కోట్లు, గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటి కోసం ‘జల్ జీవన్ మిషన్’ను 2028 వరకు పొడిగించారని వివరించారు.
నెల్లూరుకు అమృత్ పథకం కింద రూ. 125 కోట్లు కేటాయించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కింద రూ. 9,412 కోట్లు కేటాయించారని తెలిపారు. స్వయం సహాయక గ్రూపుల కోసం గ్రామీణ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపరిచారని అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రూ. 57,57,000 కోట్లు వాటాగా వస్తాయని, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ. 30,000 నుంచి 40,000 కోట్లు రావచ్చని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 18,000 కోట్లు కేటాయించగా, 41.50 మీటర్ల ఎత్తు నీరు నిల్వ ఉండే విధంగా రూ. 12,157 కోట్లు ఆమోదించారని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,936 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 15,000 కోట్ల గ్రాంట్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి విడతల వారీగా విడుదల చేస్తుందని తెలిపారు. .విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 3,295 కోట్లు, వైజాగ్ పోర్టుకు రూ. 730 కోట్లు, ఆహార సబ్సిడీకి రూ. 2,03,420 కోట్లు కేటాయించారని వివరించారు.
నెల్లూరు జిల్లాకు రూ. 2,500 కోట్ల ఎరువుల సబ్సిడీ అందిందని, కిసాన్ సమ్మాన్ యోజన కింద నెల్లూరు రైతులకు రూ. 6,000 చొప్పున 1,68,000 మందికి అందిస్తున్నట్లు తెలిపారు.సోమశిల-కండలేరు ప్రాజెక్టులను దీర్ఘకాలిక నీటి వనరులుగా గుర్తించారని, నెల్లూరు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు.ఇంత సమగ్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శిపారెడ్డి వంశీధర్ రెడ్డి, అడ్వకేట్ రంగరాజన్, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, రాష్ట్ర సహ ట్రెజరర్ కందుకూరు సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి, కమల,ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు పెంచలయ్య, నరసింహనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరబోలు రాజేష్ గడ్డం విజయ్ కుమార్ యశ్వంత్ సింగ్, జిల్లా కార్యదర్శి కాసా సీనయ్య, దాసరి ప్రసాద్ చిలకా ప్రవీణ్ కుమార్ ,పరుశురాం, ట్రెజరర్ సి వి సి సత్యం,మహిళా మోర్చా అధ్యక్షురాలు కరణం సుభాషిని, సోషల్ మీడియా కన్వీనర్స్ ముని సురేష్ పిడుగు లోకేష్ శివ తదితరులు పాల్గొన్నారు