*మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ అఖిలభారత సహకార వారోత్సవాలను ప్రారంభించిన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి*

 

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ అఖిలభారత సహకార వారోత్సవాలు మరియు మహిళా సాధికారత, సహకార సంస్థల యొక్క బలోపేతం అనే అంశంపై ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి

ఈ సందర్భంగా చైర్పర్సన్ గారు మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు.

మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు మహిళలకు పెద్దపీట వేశారని, మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు…

ప్రతి మహిళ కూడా పొదుపులో ఉండాలని, పొదుపులో లేని వాళ్లను ఆర్పీల ద్వారా పొదుపులో చేర్చాలని, పొదుపు ద్వారా వచ్చే లోన్స్ అన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు… పొదుపు మహిళలకు పొదుపు సంఘాల్లో ఏవైనా సమస్యలు ఉంటే, మీరందరూ కలిసి కూర్చొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని, మీ సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో మెప్మా సీవో నర్మద గారి దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు…

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉండే మెప్మా, ఆర్పీలు, అందరికీ అందుబాటులో ఉంటారని, బాగా పని చేస్తారని తెలియజేశారు… అదేవిధంగా మహిళల పట్ల మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు చాలా సపోర్ట్ గా ఉన్నారని, ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే, వాటిని పరిష్కరిస్తారని తెలియజేశారు….

ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, డి సి ఓ గురవప్ప, తిరుపాల్ రెడ్డి , సుభాషిని, సి ఓ నర్మద, మహేష్, టీఆర్ఎస్ అధ్యక్షులు, ఆర్పీలు, పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed