- మెడికల్ క్యాంపు లలో బోన్ డెన్సిటీ టెస్ట్ పెట్టడం ఇదే తొలిసారి.
- వివిధ వైద్యుల ద్వారా దాదాపు 500 మంది మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకున్నారు.
- – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.
నెల్లూరు నగరంలోని కోటమిట్ట నందు గల షాదీ మంజిల్ లో టీడీపీ మైనార్టి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ షరీఫ్ సౌజన్యంతో రెయిన్బో ఆసుపత్రి వారు మెడికల్ క్యాంపు నిర్వహించారు. మెడికల్ క్యాంపు ను ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లు పాల్గొన్నారు.
అబ్దుల్ అజీజ్ కామెంట్స్:-
నామమాత్రంగా కాకుండా అద్భుతమైన మెడికల్ క్యాంప్ ను రెయిన్ బో ఆసుపత్రి వారు నిర్వహించారు.
మెడికల్ క్యాంపు లలో బోన్ డెన్సిటీ టెస్ట్ పెట్టడం ఇదే తొలిసారి.
వివిధ వైద్యుల ద్వారా దాదాపు 500 మంది మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకున్నారు.
రెయిన్ బో ఆసుపత్రి లో ఎన్టీఆర్ వైద్య సేవ అమలులో ఉంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి వెళ్ళిపోయిన ఆసుపత్రులు తిరిగి ఎన్టీఆర్ వైద్య సేవ లో నమోదు చేసుకోండి
టీడీపీ ప్రభుత్వంలో విద్య వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తాం.
కార్యక్రమంలో మైనుద్దీన్, ఉస్మాన్, రబ్బాని, నౌషాద్, ఇంతియాజ్, జాఫర్, అజీజ్ మౌలానా, అష్రాఫ్, శ్రీదేవి, గౌనుస్నిస, జమీర్, రేష్మ, హఫీజ్, షిరిన్, సుష్మా సింగ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.