
*మెట్ట ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం విపిఆర్*
– ఎంపిగా గెలిచిన 18 నెలల్లో 10 సార్లు ఉదయగిరికి వచ్చారు ఎంపి వేమిరెడ్డి.
– గత 40 ఏళ్లలో ఏ పార్లమెంట్ సభ్యుడు ఉదయగిరిపై ఇంత అభిమానాన్ని చూపలేదు.
– విపిఆర్ నేత్ర ఉదయగిరి నుంచి ప్రారంభించడం మా అదృష్టం.
– కోవూరు నియోజకవర్గ అభివృద్దే లక్షంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పనిచేస్తున్నారు.
– ఎంపీ వేమిరెడ్డి సహకారంతో ఉదయగిరి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాను.
– ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఉదయగిరి నుంచే ప్రారంభించడం మెట్ట ప్రాంతం ప్రజలపై ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేక అభిమానమే కారణమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ గత 40 ఏళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన ఏ ఒక్కరు కూడా ఉదయగిరి ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత 18 నెలల కాలంలో దాదాపు పదిసార్లు పైగా ఉదయగిరి ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు.
ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో 36 వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత తాగనీరు అందించిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. ఉదయగిరి ప్రాంతంలో నడవలేని దివ్యాంగులకు 164 ట్రై సైకిళ్లు ఉచితంగా అందజేసి తన దాతృత్వం చాటుకొన్న విపిఆర్ గారి సేవలను ఎమ్మెల్యే కాకర్ల కొనియాడారు. ప్రజలకు సేవ చేసేందుకు రెండే వేదికలు ఉన్నాయని, అందులో ఒకటి రాజకీయమైతే రెండోది స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించే ప్రతిఫలం ఆశించని సేవ అన్నారు. రెండింటి ద్వారా ప్రజా సేవ చేస్తూ ఎంపి వేమిరెడ్డి గారు ఆదర్శంగా నిలిచారన్నారు. కంటి వైద్యానికి సంబంధించి అనుభవజ్ఞులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఇంత ఖరీదైన బస్సు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఏర్పాటు చేయలేదన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఉదయగిరి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నారు. కోవూరు నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఆయన ప్రశంశించారు. కంటి సమస్యలకు సంబంధించి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న విపిఆర్ నేత్ర సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కాకర్ల సురేష్ గారు ఉదయగిరి ప్రజానీకానికి పిలుపునిచ్చారు. తెలుగుదేశం మరియు కుటుంబ పార్టీల నాయకులు విపిఆర్ నేత్ర అందిస్తున్న ఉచిత వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు ఎల్ సి రమణారెడ్డి, మన్నేటి వెంకటరెడ్డి, స్థానిక జడ్పిటిసి రావెళ్ళ నాగేంద్ర, రామాపురం సర్పంచ్ శ్రీమతి పెంచలమ్మ, మండల టిడిపి కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, హుసేన్ తదితరులు పాల్గొన్నారు.