*మెట్టు కుటుంబసభ్యులకు ఆదాల పరామర్శ*
నెల్లూరు వైస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు గురువారం సాయంత్రం ప్రముఖ పారేశ్రామికవేత్త, విశ్రాంత లెక్చరర్ మెట్టు రాంప్రసాదరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మెట్టు రాంప్రసాదరావు ఇటీవల కాలంచేసిన నేపథ్యంలో నెల్లూరు నగరంలోని నేతాజీ నగర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, యేసు నాయుడు, సీహెచ్ హరిబాబు యాదవ్, మంగళ్లపూడి శ్రీకాంత్ రెడ్డి, షేక్ మోయినుద్దీన్, కల్లూరి లక్ష్మిరెడ్డి, బెల్లంకొండ వెంకయ్య, నాని తదితరులు ఉన్నారు.