*ముస్లింల సంక్షేమం టిడిపితోనే సాధ్యం*

– విపిఆర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన ఇస్తిమా నిర్వాహకులు.
– తబ్లిగ్ జమాత్ రాష్ట స్థాయి ఇస్తిమాకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన.
– భద్రతా చర్యలలో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో సిసి కెమెరాలు, వాకిటాకీలు.
– ఎలక్ట్రిసిటి, ఫైర్, పోలీసు తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఇస్తిమా నిర్వహణకు ఆటంకం లేకుండా చూడాలి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద ఈ నెల 22 నుంచి జరగనున్న తబ్లిగ్ జమాత్ రాష్ట స్థాయి ఇస్తిమా ఏర్పాట్లను రాష్ట వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి ఆమె పర్వేక్షించారు. ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొనే ఇస్తిమా గ్రౌండ్ లో టెంట్లు, స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇస్తిమా నిర్వహణకు సంబంధించి జేసీబీలతో గ్రౌండ్ క్లియరెన్స్, శానిటేషన్, స్నానపానాదులకు టాంకర్లతో నీటి సరఫరా, లక్షలాది భక్తులకు తాగునీటి బాటిల్స్ అందిస్తూ దైవ కార్యానికి సహాయ సహకారాలందిస్తున్న ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తబ్లిగ్ జమాత్ రాష్ట స్థాయి ఇస్తిమాను మతాలకతీతమైన శాంతిసభగా అభివర్ణించారు. ఇస్తిమా నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా చూడాలని ఎలక్ట్రిసిటి, RWS, ఫైర్, శానిటేషన్, పోలీస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తిమా గ్రౌండ్ లో ప్రత్యేకంగా ఓ స్టాల్ ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్వవేక్షిస్తామన్నారు. భద్రతా చర్యలలో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో సిసి కెమెరాలు, వాకిటాకీలు అందచేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పాటు పాడేది ఒక్క తెలుగుదేశం పార్టేయేనన్నారు. మసీదు ఇమాములకు నెలసరి జీతాలతో పాటు రంజాన్ మాసం సందర్భంగా ప్రార్థనలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజూ ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇళ్లకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. ఇస్తిమా నిర్వాహకులకు స్థానిక టిడిపి నాయకులు సహకరించాలని సూచించారు. ప్రయివేట్ ఆసుపత్రులు ముందుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ, ఎలక్ట్రిసిటి, RWS, ఫైర్, శానిటేషన్, పోలీస్ తదితర శాఖలకు చెందిన అధికారులతో పాటు మైనారిటి నాయకులు జాకీర్ షరీఫ్, ఇంతియాజ్, మదీనా ఇంతియాజ్, సాబీర్. జమీర్, జహంగీర్, స్థానిక టిడిపి నాయకులు సతీష్, కోడూరు కమలాకర్ రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి బోయపాటి సుధాకర్, కంచర్ల కిషోర్, తువ్వర ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *