మురుగునీటి పారుదలకు తగిన చర్యలు తీసుకోండి
– కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో డ్రైను కాలువల ద్వారా మురుగు నీటి పారుదల సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా ఈరోజు స్థానిక 5వ డివిజన్ సత్యనారాయణపురం, వైకుంఠపురం తదితర ప్రాంతాలలో కమిషనర్ శనివారం పర్యటించారు.
డ్రైను కాలువలలో మురుగునీటి పారుదల సులభతరంగా ఉండేందుకు ఏర్పాటుచేసిన ఐరన్ మెష్ లు నేలకు సమాంతరంగా ఉండునట్లు సరి చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డ్రైను కాలువల్లో చెత్త వేయి వారిని గుర్తించేందుకు సిబ్బందిని నియమించి వారికి పెనాల్టీలు విధించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ పారిశుద్ధ సిబ్బంది వారికి ఆదేశాలు ఇచ్చారు.
డ్రైను కాలువలో మురుగునీటి పారుదలకు ఇబ్బందిగా ఉన్న దగ్గర కల్వర్ట్ నిర్మించాలని స్థానిక ప్రజలు కమీషనర్ ను కోరినారు. వెంటనే ఇంజనీరింగ్ అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో భాగంగా రోడ్లపై ఉన్న గుంతలను, మ్యాన్ హోల్స్ వద్ద రోడ్డుకి సమాంతరంగా ఏర్పాటు చేయునట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా వైకుంఠపురం ఎస్టి కాలనీ వద్ద మురుగు కాలవన నీరును అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కు అనుసంధానం చర్యలను వెంటనే చేపట్టవలసినదిగా సూచించారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు చర్యలు చేపట్టవలసిందిగా ఇంజనీరింగ్ విభాగం వారికి ఆదేశాలు ఇచ్చారు.
సత్యనారాయణపురం పార్కులో ఏర్పాటు చేసిన పిల్లల ఆట వస్తువులు, జిమ్ పరికరాలను పరిశీలించి, పార్కు మొత్తం మట్టిని నింపి అలాగే ఆహ్లాదము కొరకు పచ్చదనాన్ని పెంచవలసినదిగా ఇంజనీరింగ్ ఈ.ఈ. రహంతూ జానీ, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఈ.ఈ రహంతు జానీ, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురాం, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రకాష్, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.