*” ముమ్మాటికి శేషయ్యపై తప్పుడు కేసే”-కాకాణి*
*బీసీలను, మరీ ముఖ్యంగా యాదవులను అణగతొక్కాలని సోమిరెడ్డి కుట్ర.*
*యాదవ సామాజిక వర్గానికి చెందిన వెంకట శేషయ్య యాదవ్ ఎదుగుదలను ఓర్వలేక కుట్రపన్ని, కేసులో ఇరికించిన సోమిరెడ్డి.*
*సోమిరెడ్డి పలు సందర్భాలలో ఒక యాదవ్ నన్ను ప్రశ్నించడమా..!, వాడి అంతు చూస్తానంటూ మొరుగుళ్ళు..*
*శేషయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక, పోలీసులు, రెవిన్యూ సిబ్బందితో తప్పుడు కేసు బనాయించిన సోమిరెడ్డి.*
*మీడియా సమావేశంలో సిఐ, ఆర్ఐలు కోర్టుకు సమర్పించిన ఆధారాలు తప్పుడువి అని, మీడియా ముందు ఆధారాలతో సహా వెల్లడించిన కాకాణి.*
*తమకు సంబంధం లేకుండానే, తాము ఇంట్లో లేకుండానే, తాము ఇంట్లో ఉండి, ఖాళీ స్టాంపు పత్రాలు సిఐ కి ఇచ్చామని ఆర్ఐ ధ్రువీకరించడం కోర్టును పక్కదారి పట్టించడానికి కట్టుకథ అల్లడమేనని, ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిర్యాదురాలు శ్రావణి అత్తమామలు వెంకటమ్మ, పెంచలయ్య.*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:26-12-2024*
*నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్యను కలవడానికి వచ్చిన సందర్బంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*స్క్రోలింగ్ పాయింట్స్:*
👉 వెంకట శేషయ్య విషయంలో ఒక మహిళ ఇచ్చిన కేసును పోలీసులు, రెవిన్యూ సిబ్బంది తప్పుదారి పట్టించి, శేషయ్యను జైలు పాలు చేయడం అన్యాయం.
👉 వెంకట శేషయ్య అరెస్టు దగ్గర నుండి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే వరకు సిఐ, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డా, మౌనంగానే భరించాం.
👉 మెజిస్ట్రేట్ ముందు శేషయ్యను హాజరు పరిచినప్పుడు కేసుకు తగిన ఆధారాలు లేవని, ఆధారాలుంటే సమర్పించాలని మెజిస్ట్రేట్ రిమాండ్ ను తిరస్కరించి తిప్పి పంపారు.
👉 వెంకటాచలం సీఐ సుబ్బారావు శేషయ్యను ఎలాగైనా, జైలుకు పంపాలని తప్పుడు స్టాంప్ పేపర్లు తెప్పించి, కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోయినా, వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్లు, వాళ్లే ఖాళీ స్టాంప్ పేపర్లు సిఐ చేతికి ఇచ్చినట్లు మాహాజరునామాలో పేర్కొని, తప్పుడు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాడు.
👉 వెంకటాచలం సీఐ సుబ్బారావు తాను సృష్టించిన తప్పుడు సాక్ష్యానికి రెవిన్యూ ఇన్స్ పెక్టర్ రవి వంతపాడుతూ, సీజ్ చేసినట్టుగా, సంఘటన స్థలానికి రాకుండానే దొంగ సంతకం చేసి ద్రోహానికి పాల్పడ్డాడు.
👉 సర్కిల్ ఇన్స్ పెక్టర్, రెవిన్యూ ఇన్స్ పెక్టర్లు కోర్టుకు సమర్పించిన తప్పుడు సాక్ష్యాలు, రికార్డులు తారుమారు నా కళ్ల ముందే జరిగినందున వాస్తవాలు బయటికి చెబుతున్నాం.
👉 ఎస్పీ గారు విచారణ చేపట్టి, ఆరోజు సంఘటన స్థలంలో సీఐ,ఆర్ఐ సృష్టించిన తప్పుడు సాక్ష్యాలపై, నాతోపాటు అక్కడికి చేరుకున్న వందలాదిమందిని ఎవరిని విచారించిన వాస్తవాలు వెలుగు చూస్తాయి.
👉 తప్పుడు సాక్ష్యాలు కోర్టులో సమర్పించి శేషయ్యకు రిమాండ్ విధించే విధంగా సిఐ,ఆర్ఐ లు కుట్రపన్నారు.
👉 చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, రెవిన్యూ సిబ్బంది వందలాది ప్రజల సమక్షంలో తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపించే ప్రయత్నం చేస్తున్నందున ముమ్మాటికీ ఇది తప్పుడు కేసేనని నిర్ధారించుకున్నాం.
👉 శేషయ్య అరెస్టు, రిమాండ్ విషయంలో జరిగిన అనేక అవకతవకలు, ఉల్లంఘనలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటాం తప్ప, ఎవరిని విడిచిపెట్టం.
👉 శేషయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక, పిరికిపంద సోమిరెడ్డి పోలీసులను, రెవిన్యూ సిబ్బందిని అడ్డుపెట్టుకొని దొంగ కేసులు బనాయించి, జైలుకు పంపాడు.
👉 సోమిరెడ్డి తాను తన కొడుకు తప్ప సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా, ఎవ్వరినీ ఎదగనివ్వడు, ఎవ్వరికి సహాయం చేయడు.
👉 సర్వేపల్లి నియోజకవర్గం లో కార్యకర్తల నోటి దగ్గర కూడు కూడా తాను, తన కొడుకు లాగేసుకుంటున్నారు తప్ప, సొంత కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదు.
👉 శేషయ్య విషయంలో సోమిరెడ్డి ప్రోద్బలంతో పోలీసులు, రెవిన్యూ సిబ్బంది ద్వారా నడిపిన కుట్రకోణం త్వరలోనే బట్టబయలు అవుతుంది.
👉 నెల్లూరు జిల్లాలో పోలీసులు ఎవరిపైనైనా, అన్యాయంగా దాడికి పాల్పడితే, సంఘటితంగా అందరం కలిసి వెళ్లి ప్రశ్నిద్దాం.. కేసులు పెడితే జైలుకు వెళ్దాం.
👉 పోలీసులు, కేసులు, అరెస్టులకు భయపడి బ్రతకాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వాలు ఎన్నడూ శాశ్వతం కాదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించిన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టం.
👉 నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వాటిల్లినా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ తోబుట్టువుగా, మీ బిడ్డగా అండగా నిలుస్తా..