*నెల్లూరులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన*
*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం*
*మినీ బైపాస్ లో భారీ హోర్డింగ్ దర్శనం*
*వైసీపీకి ఏమైన స్పెషల్ హక్కులున్నయా అంటూ పలువురు విమర్శ*
*నెల్లూరు* : రాష్ట్రంలో వైసీపీ ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో నెల్లూరులోని మిని బైపాస్ వద్ద జగన్ కోసం సిద్దం అనే పెద్ద హోర్డింగ్ దర్శనమిస్తున్న అధికారులు మాత్రం పట్టిపట్టనట్లు మొద్దనిద్ర వ్యవస్థలో ఉన్నారు.కళ్లముందే వైసీపీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. పీవీఎన్ కళ్యాణ మండపం వద్ద ఓ బిల్డింగ్ పై పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేసి ఉన్న ఆ హోర్డింగ్ అధికారులకు కనిపించకపోవడం శోచనీయం. అసలు అధికారులు అధికారి పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పలు వివర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైన ఆ హోర్డింగ్ ను తొలగించాలని పలువురు కోరుచున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీకి స్పెషల్ హక్కులు ఏమైనా ఉన్నాయా? అంటూ విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.