*మునిసిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ నిట్టనిలువునా కూల్చి వేసిన  వై సి పి నాయకుడు బాలకృష్ణారెడ్డి  ఇంటిని పరిశీలించిన కాకాణి,పర్వతరెడ్డి*

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి.. టిడిపి చేసిన దౌర్జన్యకాండ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేసి.. పార్టీ అండగా ఉంటుందని బాలకృష్ణ రెడ్డి గారికి భరోసానిచ్చి.. టీడీపీ నేతలను హెచ్చరించారు…..

*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు బాలాజినగర్ 15 వ డివిజన్ లో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చివేసిన వైఎస్ఆర్సిపి నాయకులు *బాలకృష్ణారెడ్డి* గారి ఇంటిని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి..వై సి పి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు పరిశీలించారు.

ఈ సందర్బంగా *టిడిపి చేసిన దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి నాయకులు నిరసన తెలియజేశారు* .

*కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు *చంద్రశేఖర్ రెడ్డి* గారు..*బాలకృష్ణ రెడ్డి* గారితో ..మాట్లాడి పార్టీ అండగా అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు.

🔹 *కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు ధమనకాండ నిర్వహిస్తుందని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు.*

🔹 *అందుకు పరాకాష్టగా బాలకృష్ణ రెడ్డి గారి ఇంటిని దౌర్జన్యంగా కూల్చి వేశారని పేర్కొన్నారు.*

🔹 *ఇష్ట రీతిలో వ్యవహరిస్తూ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్ల ను మంత్రి నారాయణ, శ్రీనివాసులు రెడ్డి లు కూల్చివేస్తామంటే.. ఇది సరైన పద్ధతి కాదనిఅన్నారు.*

🔹 *ఇది మా జాగీరు అన్న రీతిలో వ్యవహరిస్తే.. కూటమి నేతలకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.*

ఈ సందర్భంగా *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..

👉 *మంత్రి నారాయణ కు నెల్లూరు ప్రజలు 70 వేలకు పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించింది.. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికా అని ప్రశ్నించారు.*

👉 *ఈరోజు మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో.. సామాన్యులనే కాదు, వైద్యులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.*

👉 *పొగతోటలోని డాక్టర్లకు సంబంధించిన హాస్పిటల్ నేమ్ బోర్డులను తొలగిస్తూ, వారి కట్టడాలను కూల్చి వేస్తూ.. మరికొందరి కట్టడాలను కూల్చివేస్తామంటూ బెదిరింపులకు దిగుతూ డాక్టర్లను మంత్రి నారాయణ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.*

👉 *నెల్లూరులో పేద మధ్యతరగతి వారి ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేస్తూ.. మంత్రి నారాయణ నెల్లూరు ను సర్వ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.*

👉 *అంతేకాకుండా చిన్నచిన్న ఇళ్లను కూడా..మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టేపులతో కొలిపించి మరి పన్నులు వేస్తూ.. ప్రజలను పీడించుకుని తింటున్నాడని దుయ్యబట్టారు.*

👉 *పన్నులు కట్టలేని స్థితిలో ఉన్న పేద వారిపై.. జులం ప్రదర్శిస్తూ వారి ఇంటి కరెంట్ కనెక్షన్, మంచినీటి కనెక్షన్ లు కట్ చేసి నారాయణ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.*

👉 *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు ప్రజలు ఎవరిపైనైనా..తెలుగుదేశం పార్టీ చేస్తున్న.. అక్రమాలను ముందుగా తెలియజేస్తే వారికి పార్టీ అండగా ఉండడమే కాకుండా.. వారి పక్షాన నిలబడి న్యాయపోరాటం చేస్తామని తెలియజేశారు.*

👉 *ప్రత్యేకంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు నగర నియోజకవర్గానికి విచ్చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలకృష్ణ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed