*ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రదేశాల పరిశీలనలో భాగంగా వింజమూరులోని గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని పరిశీలించిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నెల 1వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ కు వింజమూరు ప్రాంతంలో గెస్ట్ హౌస్ నిర్వహణ బాధ్యతలను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది.
ఆ మేరకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తో కలిసి కమిషనర్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రదేశాల పరిశీలనలో భాగంగా వింజమూరులోని గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని పరిశీలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వింజమూరు ప్రాంతంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ తో పాటు ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్న సందర్భంగా గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని ఉపయోగించనున్నారు.
గెస్ట్ హౌస్ కు సంబంధించి ప్రోటోకాల్ నిర్వహణకు గాను అన్ని ఏర్పాట్లు, వ్యవహార బాధ్యతలను కమిషనర్ చేపట్టనున్నారు. కమిషనర్ సహాయకులుగా దుత్తలూరు తహాసిల్దార్ వ్యవహరించనున్నారు.