**ముక్కు రాధాకృష్ణ గౌడ్ ను అభినందించిన తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్ డి విల్సన్**

భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్ ను నెల్లూరు నగరంలోని ఆదిత్య నగర్ లో ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి విల్సన్ కలిసి ఆయనకు శాలువా కప్పి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ పటిష్టత కోసం గత 35 సంవత్సరాలుగా బిజెపి అనుబంధ సంస్థలలో చేసిన కృషికి ఫలితంగా బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు గుర్తింపు నిస్తూ రాష్ట్రస్థాయిలో మంచి బాధ్యతలు అప్పజెప్పడం ఆనందదాయకం అన్నారు.

అలాగే మునుపటిలాగే శక్తి వంచన లేకుండా ప్రజలతో మమేకమై ప్రజల కష్టనష్టాలు సుఖసంతోషాల్లో భాగం పంచుకొని నూతనంగా వేలాది మందిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా మరింత గుర్తింపు పొందాలని తద్వారా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని పార్టీకి ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాలలో మంచి నాయకులను తయారు చేయాలని మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆశయ సాధన కోసం శ్యాంప్రసాద్. ముఖర్జీ, పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ వంటి నాయకుల సిద్ధాంతాలు అమలు చేయడం కోసం మరియు ఆటల్ ఆలోచనలు మోడీ ఆచరణలతో ముందుకు సాగాలని కూటమి ప్రభుత్వ పాలన ఫలాలను అన్ని వర్గాల అర్హులైన ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పై కార్యక్రమంలో బిజెపి కో-ఆపరేటివ్ సెల్ రాష్ట్ర కోకన్వీనర్ కోట వెంకటేశ్వరరావు మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పాలిచర్ల. ఉదయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కాయల. మధు తదితరులు పాల్గొని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed