*ముక్కంటీశ్వరుడి సేవలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*
మహాశివరాత్రి సందర్బంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహిళా భక్తులకు
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పసుపు, కుంకుమ, రవిక, గాజులు, పసుపు దారం అందచేసి దాతృత్వం చాటుకున్నారు.
శుభాలు కలిగించే ఆ శంకరుడి అనుగ్రహంతో రాష్టం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలని ఆమె ఆకాంక్షించారు. సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ ముక్కంటీశ్వరుడి సన్నిధిలో మహిళా భక్తులకు “వాయనం” అందచేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఔదార్యం పట్ల మహిళా భక్తజనంతో పాటు ఆలయ పాలకవర్గం హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో పాటు టిడిపి నాయకులు అడపాల అనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.