మా నాయకుడు కాకాణి పేరు చేర్చడం విడ్డూరం..
– కాకాణి అన్న ఏ తప్పు చేయలేదు.
– జగనన్న మళ్ళీ సీఎం అవుతారు
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర స్పోక్స్‌ పర్సన్‌ మల్లి నిర్మల

నిబద్ధత గల నాయకుడు కాకాణి పేరును అక్రమ మైనింగ్‌ కేసులో చేర్చడం విడ్డూరంగా ఉందని వైఎస్‌ఆర్‌సీపీ స్టేట్‌ అఫీషియల్‌ స్పోక్స్‌ పర్సన్‌ మల్లి నిర్మల ధ్వజమెత్తారు. గత పది రోజులుగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలు పూర్తిగా ఆధారాలు లేనివని బుధవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె వివరించారు. ఒకసారి జడ్పీ ఛైర్మన్‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేయడంతో పాటు పార్టీ బాధ్యతలను నిరంతరం నిబద్దతతో చేసే కాకాణి అన్నపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోరాట పటిమను తట్టుకోలేక అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురిచేయడానికే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. గతంలో తమ నాయకుడు కాకాణి మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ మైనింగ్‌పై విచారణ చేయాలని ఆదేశించారన్నారు. అప్పటి అధికారులు విచారణ జరిపి నివేదికను అందచేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపించిన ఆయనపై తప్పుడు కేసులు బనాయించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ సంబంధం లేకుండా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు గురి చేయడం టీడీపీ నాయకులకు అలవాటేనని తెలిపారు. 2003లో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉండి ఒక శాసన సభ్యుడితో కలిసి అక్రమ మైనింగ్‌ చేసిన సంగతి అందరికి తెలిసిందేనన్నారు. అప్పటి జిల్లా అటవీ శాఖాధికారి స్వయంగా వాహనాలను సీజ్‌ చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. అధికార పార్టీలో ఉండి ఒక బీసీ వర్గానికి చెందిన ఆ అటవీ శాఖాధికారిని టార్గెట్‌ చేసి అక్రమ బదిలీ చేశారని తెలిపారు. అప్పట్లో బీసీ నాయకులు మూడు రోజులు గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంఘటనను ప్రజలు మర్చిపోలేదన్నారు. మంత్రిగాఉండి అక్రమాలకు పాల్పడిన ఆయన మంచివాడా… ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ తాను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ మైనింగ్‌ పై విచారణ జరిపించిన కాకాణి మంచివాడా…. ఎవరు మంచివారు అని ప్రజలకు తెలుసన్నారు. వెంకటాచలంలో జరిగిన దాష్టికాలను, అల్లీపురంలో నకిలీ విత్తనాల కేంద్రాన్ని వన సంరక్షణ నిధులను దోచుకున్న వైనాన్ని ప్రజలు మర్చిపోరని, ఎవరు నిబద్ధత గల నాయకుడో అందరికి తెలుసన్నారు. నిరంతరం శ్రమించే తమ నాయకుడు కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమ కేసును సంబంధించి స్క్వాష్‌ పిటీషన్‌తో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తమ నాయకుడు కాకాణి గోవర్థన్‌రెడ్డికి కావాలని నోటీసులు పంపించడం వేధింపుల్లోభాగం కాదా అని ప్రశ్నించారు. ఐదు సార్లు ఎన్నికల్లో ఓడిపోయి దింపుడు కల్లాం ఆశల్లాగా ఈ సారి టిక్కెట్‌ లభిస్తే గెలుస్తామా… ఓడిపోతామా అన్న సందిగ్ధంలో నుంచి గెలిచి అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. కాకాణి అన్న కోసం వారం రోజులుగా వెల్లువెత్తుతున్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆదరణ చూసి అధికార పార్టీ నాయకులకు తట్టుకోలేకున్నారని జరిగిన సంఘటనలను వివరించారు. తమ నాయకుడు జగన్‌ మోహన్‌రెడ్డి మళ్ళీ ముఖ్య మంత్రి అవుతారని, ఇటువంటి అక్రమాలు ఆగడాలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed