*మాస్టార్… విజయం పక్కా…*
– భారీ మెజారిటీ వస్తుందని లెక్కలు
– జూన్ 4న ఎన్టీఏ కూటమి ఏర్పాటు ఖాయమంటున్న తెలుగు తమ్ముళ్లు
–
– ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ పొంగూరు నారాయణ
2024 సార్వత్రిక ఎన్నికల్లో… మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ విజయం పక్కా అని…ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ప్రధాతకి భారీ మెజారిటీతో కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన నారాయణ… నెల్లూరు సిటీని అభివృద్ధి చేసేందుకు రూ. వేల కోట్ల నిధులు తీసుకురావడమే. అదే విధంగా 2019లో దొంగ ఓట్లతో వైసీపీ నాయకులు గెలిచారని…ఈ సారి అలాంటి తప్పు జరగకూడదన్న ఉద్దేశంతో… దొంగ ఓట్లపై పోరాటం చేశారు నారాయణ. ఓటర్ లిస్ట్ లో తప్పు జరిగితే…ఒప్పుకునే ప్రసక్తే లేదని…అది కింది స్థాయి అధికారైనా సరే…పై స్థాయి అధికారైనా సరే అంటూ హెచ్చరించారు నారాయణ. ఇలా ఓ పక్క అభివృద్ధి, మరో పక్క దొంగ ఓట్లపై భరతం పట్టడంతో…2024 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరిగింది. మే 13న ఓటింగ్ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పేరు పేరున నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. నాకు అండగా నిలిచిన వారందరికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు నారాయణ.
*విజయానికి కారణం ఇదే…*
డాక్టర్ పొంగూరు నారాయణ 2014 – 2019 మధ్యకాలంలో తెలుగుదేశంప్రభుత్వ హయంలో మంత్రిగా ఉన్న సమయంలో నిలువ నీడలేని వేలాది మంది నెల్లూరు నగర పేదలకు అధునాతన సౌకర్యాలతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇచ్చారు. నగరంలో మురుగు నీటితో పాటు దోమల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం వందల కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త పైపులైను ఏర్పాటు చేశారు. గతుకుల రోడ్ల మరమ్మతుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించారు. అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి అధునాతనంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీపడే స్థాయికి వాటిని చేర్చారు. నగరంలో ఎంతో సుందరీకరణ పనులు, ఏసీ బస్‌స్టాండ్‌లు, నెక్లెస్‌రోడ్డు, బారాషహీద్‌దర్గా అభివృద్ధి ఇలా చెప్పుకుంటూ ఎన్నోఎన్నెన్నో పనులను ప్రజల కోసం చేపట్టారు. వీటన్నింటి వెనుక అప్పటి మాజీ మంత్రి నారాయణ కృషి ఎంతో ఉంది.
*గెలిచేది మా మాస్టారే…*
మే 13న జరిగే ఎన్నికలు తరువాత…టీడీపీ నేతలు ముందస్తు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అదే విధంగా ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించి…2024 జూన్ 4న రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి అధికారంలోకి రావడం తధ్యమని…మా నారాయణ మాస్టార్…లక్ష మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ శాతం కూడా పెరిగిందని…ప్రజలందరూ ఈ సారి అభివృద్ధి ప్రధాతకే పట్టం కట్టనున్నారని ఆ పార్టీ నేతలు, నాయకులు చెబుతున్నారు.
*ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు – డాక్టర్ పొంగూరు నారాయణ*
ఎన్నికల సమరంలో నా విజయం కోసం ప్రతి నిత్యం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరున ధన్యవాదాలు.. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఓటరు మహాశ్రయులకు కృతజ్ఞతలు… మిత్రపక్షపార్టీలైన బీజేపీ, జనసేన పార్టీలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరి ఆశీర్వాదంతో భారీ ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంది. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రజాకూటమి ప్రభుత్వం రాబోతుంది. జరిగిన ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా ఉంటానని, రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు మీ కష్టసుఖాలలో తోడుగా ఉంటానని తెలియజేస్తున్నాను. నాకు అండగా నిలిచిన పాత్రికేయ సోదర సోదరీ మణులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.