*మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం*
– బడుగు బలహీన వర్గాలకు ఆర్ధిక చేయూత
– పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టిడిపి కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలో“ప్రధానమంత్రి అను సూచిత్ జాతి అభ్యుదయ యోజన” (PMAJAY) పధకం ద్వారా ఎంపిక అయిన 16 మంది ఎస్సీ సోదర సోదరీమణులకు 35 లక్షల రూపాయల చెక్కులు అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ సోదర సోదరీమణులను ఆర్ధికంగా ఆదుకునేందుకు కేంద్రంలోని కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పధకాలు చేపట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఆచరణలో నిరూపిస్తున్నారని ఆమె ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొనియాడారు. స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు లబ్దిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి నాగరాజకుమారి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి మండల నాయకులు ఇంతా మల్లారెడ్డి, బత్తుల హరికృష్ణ, ఎంవి శేషయ్య, రావెళ్ల వీరేంద్రనాయుడు, బెజవాడ వంశి కృష్ణా రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డిలతో పాటు నియోజకవర్గ పరిధిలోని వెలుగు సిసిలు పాల్గొన్నారు.