*మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం. : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ఆర్థికమంత్రిగా, ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి.*
*ఆనాడు సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టిన మేధావి ఆయనే.*
*జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వంటి ఎన్నో సంస్కరణలు అమలులోకి తెచ్చి చరిత్రలో నిలిచిపోయారు.*
*ఈ రోజు దేశవ్యాప్తంగా కనీస అవసరంగా మారిన ఆధార్ కార్డుకు రూపకల్పన జరిగింది కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే…*
*నీతి, నిజాయతీలతో మెలుగుతూ మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక పెద్దదిక్కును కోల్పోయింది.*
*మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.*
*సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంఎల్ఏ, సర్వేపల్లి*