*మహిళా సంక్షేమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే*
*టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి రాగానే అమలులోకి సూపర్ సిక్స్ పథకాలు*
*మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ప్రతి నెలా రూ.1500*
*చదువుకునే ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.15,000*
*సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, తిరుపతి ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ ను భారీ మెజార్టీతో ఆశీర్వదించండి*
*తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో నిర్వహించిన మహిళా సదస్సులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి*
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానుభావుడు టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆరే
రూ.2 కే కిలో బియ్యం అందించి పేద ప్రజలు మూడు పూట్లా ఆకలి తీర్చుకునే అవకాశం కల్పించారు
రాష్ట్రానికే ఆదర్శంగా నెల్లూరులో ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమానికి అప్పట్లో జిల్లా కన్వీనర్ గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహరించారు
ఉమ్మడి ఏపీ అంతా సారాయి అంగళ్లకు వేలం పాటలు నిర్వహించినా నెల్లూరులో మాత్రం జరగకుండా అడ్డుకున్నారు
టీడీపీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించారు
మొదటి నుంచి మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది
వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి సొంత చెళ్లెల్లకే అన్యాయం చేసి రోడ్డు పాల్జేశారు
మద్యనిషేధం హామీ ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సొంతంగా మద్యం వ్యాపారం తెరిచి నాసిరకమైన మద్యంతో పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు
ఇంట్లో ప్రతి బిడ్డకు అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు చొప్పున హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే పథకం పరిమితం చేశారు.
రకరకాల ఆంక్షలు, నిబంధనల సాకుతో అమ్మఒడి లబ్ధిదారులను లక్షల సంఖ్యల్లో తగ్గించేశారు
ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.12 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ రోజే పుట్టే బిడ్డ నెత్తిన కూడా రూ.2.50 లక్షల అప్పు పెట్టారు
వివిధ రకాల పన్నులను ఇష్టారాజ్యంగా పెంచి నిత్యావసర సరుకుల ధరలను ఆకాశాన్ని అంటించారు
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను ఏపీలో భారీగా పెంచేశారు
కరెంట్ చార్జీలను తొమ్మిది సార్లు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపారు. బస్సు చార్జీలదీ అదే పరిస్థితి
ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతి మహిళపై ఉంది
తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే మహిళల కోసం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయబోతున్నారు
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు
ప్రతి మహిళకు నెలనెలా రూ.1500 అందించబోతున్నారు.
చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15000 అందిస్తారు.
కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించబోతున్నారు
వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పెళ్లికానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, విదేశీ విద్య, దుల్హన్ తదితర ఎన్నో పథకాలను తిరిగి అమలు చేయబోతున్నారు.
ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కమలం గుర్తుకు ఓటు వేసి తిరుపతి ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ ను ఆశీర్వదించాలని కోరుతున్నాం.