*మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం*
– ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి.
– స్వయం ఉపాధికి సువర్ణాకాశం
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలు స్వయంగా ఉపాధి అవకాశాలు పొందడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించగలరన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో జరిగిన ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారితో కలిసి ఆమె ప్రారంభించారు. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రానికి హాజరైన మహిళలకు ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగా బిసి కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ మహిళల జీవనోపాధికి సహాయప డుతుందన్నారు. కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ లో శిక్షణ తీసుకున్నాక స్వంత టైలరింగ్ షాపు మహిళలకు ఆర్థికంగా ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. మీరంతా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. ఈ శిక్షణా కేంద్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టైలరింగ్ ద్వారా ప్రతిభను చాటుకొని ఆర్ధికంగా బలోపేతం కావాలని కోరారు. మహిళా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు కూడా అందచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవితో పాటు పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, కోవూరు సర్పంచ్ యాకసిరి విజయమ్మ, కోవూరు ఎంపిపి తుమ్మల పార్వతి, వేగూరు సర్పంచ్ అమరావతి, టిడిపి నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.