*మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధిస్తున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలి. మద్యపానాన్ని నిషేధించాలి : మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం*
*ఐద్వా మహిళా సమస్యలపై పనిచేయడంలో ముందుంది. సారా ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఘనత అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ది : విటపు*
*****************************
*అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నెల్లూరు నగర 16వ మహాసభల సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం హాజరయ్యి ప్రసంగించారు.*
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధిస్తున్నారని అన్నారు. ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూరులో ముస్లిం మైనారిటీకి చెందిన ఒక మహిళా కమాండర్ అంత పెద్ద ఆపరేషన్ నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఖజానా నింపుకోవడం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దీనివల్ల అనేక కాపురాలు సర్వనాశనం అవుతున్నాయని అన్నారు. ఆదాయ వనరుల మధ్యన్ని చూడడం సమాజంలో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులను ప్రభుత్వాలు లెక్కచేయకపోవడం విచారకరమని అన్నారు. మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య కులం మతం పేరుతో విభజనను సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నదని వాటికి వ్యతిరేకంగా ప్రజలలో ఐక్యత సాధించే ప్రయత్నాన్ని ఐద్వా చేయాలని పిలుపునిచ్చారు. సంఘటిత ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఎన్నికైన నూతన కమిటీకి,నాయకత్వానికి అభినందనలు తెలిపారు.*