మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ – గర్భిణీలకు రూ.5000 నేరుగా బ్యాంక్ ఖాతాలో…..
గర్భిణీ స్త్రీల కోసం ప్రధానమంత్రి మాతృ వందనా యోజన, మహిళలకు గొప్ప వరం, బిజెపి జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్
గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన్ మంత్రి మాతృ వందనా యోజన (PMMVY) పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని , కానీ ఈ పథకం పట్ల చాలామంది మహిళలకు అవగాహన లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గర్భిణీ స్త్రీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, తల్లి, శిశువుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన ప్రతి గర్భిణీ మహిళ ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలి” అని సూచించారు,మొదటి బిడ్డకు ఈ పథకం వర్తిస్తుందనీ ఒకవేళ రెండవ బిడ్డ ఆడపిల్ల అయితే మాత్రమే లబ్ధి పొందవచ్చు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతర మాతృ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు అర్హులు కాదు,దరఖాస్తు విధానం గర్భిణీ స్త్రీలు అంగన్‌వాడీ కేంద్రం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రవీణ్ సూచించారు,ANM ,ఆశ వర్కర్స్, వద్ద అప్లికేషన్ ఫారం తీసుకుని, అవసరమైన ఆధార్, రేషన్ కార్డు,బ్యాంక్ ఖాతా, గర్భధారణ నమోదు ధృవీకరణ వంటి డాక్యుమెంట్లను సమర్పించాలని తెలిపారు,అలాగే, PMMVY అధికారిక వెబ్‌సైట్https://pmmvy.wcd.gov.in లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు కూడా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్య పరిరక్షణ మెరుగుపడుతుందని, నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అర్హులైన గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.