*తేదీ 24.01.2026*

*మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలి*

*************************************
*నెల్లూరు రూరల్ 30వ డివిజన్ కొత్తూరు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో రవిచంద్ర గిరిజన కాలనీ నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తరింప చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటింటికి తిరిగి కరపత్ర ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మాదాల వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరైనారు వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలకు పేద రైతులకు ఇతర వృత్తిదారులకు పని కల్పించి ఆకలి తీర్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు వర్తింప చేయాలని సిపిఎం అనేక ఏళ్లుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంది ఈ చట్టాన్ని రద్దుచేసి దాన్ని స్థానంలో విబిజి రాంజీ పేరుతో ఉన్న పనికి గ్యారెంటీ లేకుండా చేశారు. మరో ప్రక్క కార్మిక చట్టాలలో మార్పులు తెచ్చి 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కష్టం చేసే కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు ఇంటి పన్నులు పెంచేశారు. అనేక ఏళ్లుగా నివాసాలు ఉండే ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి పట్టణాలకు విస్తరింప చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.*
*ఈ కార్యక్రమంలో రూరల్ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కట్ట సతీష్ సిఐటియు రూరల్ అధ్యక్షులు మల్లా సుధాకర్ రూరల్ కమిటీ సభ్యులు బి నాగేశ్వర్ రెడ్డి కొత్తూరు శాఖ కార్యదర్శి కండె కోటేశ్వరరావు స్థానిక గిరిజన కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు*
*అభివందనాలతో*
*కండే కోటేశ్వరరావు*
*శాఖ కార్యదర్శి*
*కొత్తూరు*
*9347827960*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed