మల్టీ ప్లెక్సులు, షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ

– కమిషనర్ సూర్య తేజ

రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్ లో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తేనున్నామని కమిషనర్ సూర్య తేజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్ లో మొదటి 30 నిమిషాల వరకు వాహన పార్కింగ్ రుసుములు పూర్తిగా ఉచితమని తెలిపారు.

30 నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్ చేసిన వ్యక్తులు మల్టీప్లెక్సులు , మాల్స్ లో ఏదైనా వస్తువు కొన్నట్లుగా బిల్లులు చూపిస్తే అలాంటి వారికి రుసుములు వర్తించవని వెల్లడించారు.

బిల్లులు చూపనట్లయితే అలాంటి వారి నుంచి పార్కింగ్ రుసుములు వసూలు చేయొవచ్చని స్పష్టం చేసారు.

గంటకుపైగా పార్కింగ్ చేసిన వాహన చోదకులు సినిమా టికెట్. ఇతరత్రా బిల్లులు చూపినట్లయితే ఉచితమని, ఆధారం చూపని వారి నుంచి రుసుములు వసూలు చేయవచ్చని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed