*మరోసారి మద్యం మూటలతో దిగేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి*
*కేసులు, అరెస్టుల నుంచి ఆయన తప్పించుకుని ముఖ్యనేతలను బలి చేస్తుండటంపై కాకాణిపై గుర్రుగా వైసీపీ కేడర్*
*ఐదేళ్ల పాలనలో ఇప్పటికే సర్వేపల్లి ప్రజలను నట్టేట ముంచాడని, ఇంకా ఆయన వెంట నడిస్తే వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కూడా భవిష్యత్ లేకుండా చేస్తాడని ఆందోళనలో శ్రేణులు*
*సర్వేపల్లి ప్రజలందరూ సోమిరెడ్డిని ఆశీర్వదించేందుకు సిద్ధమైపోవడంతో…అదే మార్గంలో వైసీపీ కేడర్*
*తెలుగుదేశం పార్టీలోకి జోరుగా జరుగుతున్న చేరికలతో ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ*
*సోమవారం ఉదయం వేదయపాలెంలోని సోమిరెడ్డి కార్యాలయంలో ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామపంచాయతీకి చెందిన 150 వైఎస్ఆర్సిపి కుటుంబాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.*
*మల్లూరు గ్రామపంచాయతీ మాజీ ఎంపిటిసి వేల్పుల మని కృష్ణ, ఉలవపాటి నవీన్, సాదం నాగేశ్వర్రావు, పెళ్లూరు అనిల్ ఆధ్వర్యంలో మల్లూరు గ్రామం నుండి 60 కుటుంబాలు, మల్లూరు హరిజనవాడ నుండి 60 కుటుంబాలు, కుమ్మరిమిట్ట నుండి 30 కుటుంబాలు మొత్తం 150 కుటుంబాలు మల్లూరు గ్రామపంచాయతీ వైసిపి పార్టీని ఖాళీ చేస్తూ వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.*
*పార్టీలో చేరిన వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలు తప్పి ఆత్మీయ స్వాగతం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.*