*”మరుపురాని మహానేత వైయస్సార్”- కాకాణి*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:02-09-2025*

*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారు, పార్లమెంటరీ పరిశీలకులు జంకే వెంకట రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఇంచార్జీ విజయకుమార్ రెడ్డి గారు, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత రెడ్డి గారు, వైకాపా అనుబంధ సంఘ అధ్యక్షులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులతో కలిసి దివంగతనేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళూలర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.*

*సర్వమత ప్రార్ధనలు నిర్వహించిన మత పెద్దలు*

*వైయస్సార్ వర్ధంతి సందర్బంగా నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం.*

*జిల్లా అధ్యక్షులు కాకాణి మాట్లాడుతూ..*

–  వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పాలనకు మహానేతగా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

– రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి పార్టీలకు అతీతంగా మహానేతను గుర్తు చేసుకొని కన్నీటీ పర్యంతమవుతున్నారు.

– రాజశేఖర్ రెడ్డి గారి విలువలు, విశ్వసనీయతను పునితెచ్చుకొని, అధికారం కోల్పోవడానికి కూడా సిద్ధపడిన వ్యక్తి మా అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు.

– ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి, అమలు చేయకుండా, ఎన్టీఆర్ గారితో పాటు, ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు రాజకీయ సంబరాలు చేసుకోవడం హేయం.

– చెప్పిన మాట ప్రకారం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు.

– మహానేత రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఆ మహానీయునికి ఘన నివాళులర్పిస్తున్నాం.

*మాజీ మార్కాపురం శాసనసభ్యులు జంకే వెంకట రెడ్డి గారు మాట్లాడుతూ..*

– రాజన్న పాలనలో అందరూ సంక్షేమం, అభివృద్ధి చూశారు.

– జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు.

– తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందించిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి.

– జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది.

– ఘనమైన కీర్తిని గడించిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం.

*శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ..*

– నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

– జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలతో పాటు, ఊరురా, వాడవాడలా రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ప్రజలందరూ నివాళులర్పిస్తున్నారు.

– రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు.

– చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారు.

– చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పధకమైనా ప్రవేశపెట్టలేకపోయారు.

– రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలు పొందిన పథకాల పేర్లు మార్చి దొంగచాటున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

– కూటమి ప్రభుత్వంలో ప్రజలు చీకటి రోజులు చూస్తున్నారు.

– రాష్ట్ర ప్రజలందరూ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని భావిస్తున్నారు.

– రాజశేఖర్ రెడ్డి గారు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గుర్తుచేసుకుంటూ, ఆ మహానేత ఆశయాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటున్నాం.

*నెల్లూరు రూరల్ ఇంచార్జీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ..*

– మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లాలో ప్రజలందరూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

– రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు కూడా అమలు చేయాలనే ఆలోచన చేశాయి.

– తండ్రి ఆశయాలను కొనసాగించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడవడం జరిగింది.

– విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి సంక్షేమ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలకు అందించిన ఘనత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిది.

– వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ, ప్రజలకు మహానేత ఆశయాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *