*మనుక్రాంతి రెడ్డికి జనసేనలో జరిగిన అవమానం బాధాకరం — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*మనుక్రాంత్ రెడ్డి వైసీపీలో చేరడం అదనపు బలం చేకూరింది — వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*మనుక్రాంత్ రెడ్డికి వైసీపీలో సముచితమైన ఉన్నత స్థానం — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*ప్రజాసేవ చేయాలన్న మనుక్రాంత్ రెడ్డి ఆశయాలకు మేమందరం అండగా ఉంటాం — రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
ఆరు సంవత్సరాల పాటు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా అనేక సేవలందించి పార్టీ పటిష్టతకు కేడర్ బలోపేతానికి శక్తివంచన లేకుండా నిస్వార్ధంగా సేవలందించిన జిల్లా జనసేన పార్టీ మాజీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిని అవమానపరుస్తూ అతనికి జనసేనపార్టీ అన్యాయం చేయడం చాలా బాధాకరమని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెన్నారెడ్డి కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం అని, ఆయన దేశంలో ఉన్నత చదువులు అభ్యసించి ప్రజాసేవను ఆకాంక్షించి రాజకీయాల్లోకి రావడం జరిగిందని, ఆ క్రమంలో జిల్లా జనసేన పార్టీ అభివృద్ధికి పగ్గాలు చేపట్టి అహర్నిశలు కృషి చేయడం జరిగిందని అయితే ఆ పార్టీ అధినాయకత్వం ఆయన సేవలను గుర్తించకపోవడం విచారకరమని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం శనివారం నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వీ. విజయసాయి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ తదితరులతో కలిసి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అని, వారి కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం అని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి అదనపు బలాన్ని చేకూరుస్తుందని, ఆయన సేవలను పార్టీ చక్కగా వినియోగించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. పార్టీలో చేరిన మనుక్రాంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుక్రాంత్ రెడ్డికి గౌరవప్రదమైన స్థానం కల్పించి, ఉన్నత స్థాయిని కల్పించి గౌరవించడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పోట్లూరు స్రవంతి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, నగర పార్టీ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచల రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర రెడ్డి, రాష్ట్ర యూత్ అధికార ప్రతినిధి జీవి ప్రసాద్ నియోజకవర్గం పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి పలువురు పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.