*మనందరిదీ తెలుగుదేశం కుటుంబం*
– మనందరిదీ ఒకటే కుటుంబం.. ఉమ్మడి కుటుంబం
– రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా సీఎం కే ఉంది
– ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు
– ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ముందుకు సాగాలి
– నాయకులు, కార్యకర్తలకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబం అని, ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు సాగుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు కనుపర్తిపాడు లోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన నెల్లూరు పార్లమెంటు మహానాడు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులు అభిమానులతో విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కిటకిటలాడింది. పసుపు జెండా రెపరెపలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలుపార్టీ నాయకులు, కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం జాతరను తలపించింది. ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మంత్రి పొంగూరు నారాయణ, మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారని, ప్రపంచంలోనే తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడ్డారని, అలాంటి వారికి ఎంపీగా తప్పకుండా అండగా నిలబడతానన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త పాత నాయకుల కలయికతో పార్టీ ముందుకు సాగాలన్నారు. ఒక్క క్షణం తీరిక లేకుండా కష్టపడి పని చేసే ప్రతి సీఎం చంద్రబాబు నాయుడు గారిదని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ అటు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తున్నారన్నారు. త్వరలోనే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అమలు చేయనున్నారని చెప్పారు. గుంటలరహిత రాష్ట్రగా తీర్చిదిద్దారన్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు సాగుతుందని వెల్లడించారు.