*మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన అబ్దుల్ అజీజ్*
నాడు రెండు మున్సిపల్ కళాశాలలను ఏర్పాటు చేసాం
ఇక్కడ చదివిన పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి చేరారు
ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు – షేక్. అబ్దుల్ అజీజ్,
నెల్లూరు నగరంలోని వి ఆర్ మరియు పిఎన్ఎం మున్సిపల్ జూనియర్ కళాశాల లలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కమీషనర్ సూర్య తేజ తో కలిసి ప్రారంభించారు.
ముందుగా విఆర్ కళాశాల నందు పథకాన్ని ప్రారంభించి పిల్లలకు భోజనాన్ని స్వయంగా వడ్డించారు. అనంతరం పిఎన్ఎం కళాశాల నందు పథకాన్ని ప్రారంభించి పిల్లలకు వడ్డించారు.
ఈ సందర్భంగా పిఎన్ఎం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వారికి మరుగుదొడ్లు, త్రాగునీటి సమస్య ఉందని అబ్దుల్ అజీజ్ దృష్టికి తీసుకొని వచ్చారు. వెంటనే స్పందించిన అబ్దుల్ అజీజ్ కమిషనర్ కు సంబంధించిన ఏ ఈ కి ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ కామెంట్స్
ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్నం బడి భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా నారా లోకేష్ కి ధన్యవాదాలు.
రాష్ట్రంలోని 44129 స్కూల్లు కాలేజీల్లో పౌష్టికాహారాలతో కూడిన ఆహారాన్ని 33 లక్షల 81 వేల మంది విద్యార్థులకు అందిస్తున్నాం.
ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్న భావితరాల భవిష్యత్తు అయిన విద్యార్థులు ఆహారం కోసం ఎవరూ చదువు మానేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకుని వచ్చారు.
వారానికి ఐదు రోజులు ఉడకబెట్టిన గుడ్డు చిక్కి పెడుతున్నారు ప్రాంతాల వారీగా ఆహార అలవాట్లును బట్టి మెనూ రూపొందించారు.
కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 1850 కోట్లు ఖర్చు చేశారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు బాగా సహకరిస్తుంది.
విద్యార్థులు మంచిగా చదివి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకుని రావాలి.
ప్రభుత్వ కళాశాలలతో పాటు రాష్ట్రంలో ఉన్న ఏకైక మున్సిపల్ కళాశాలకు కూడా మధ్యాహ్న బడి భోజన పథకానికి పర్మిషన్ తీసుకువచ్చిన కమిషనర్ కు ధన్యవాదాలు.
నారాయణ మంత్రిగా నేను మేరుగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తెచ్చిన కళాశాలలు ఇవి.
ఇక్కడ చదివిన పిల్లలు ఎంతో ఉన్నత స్థానాలు ఎదిగారు వాళ్లను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది.
అమ్మాయిల కోసం ప్రత్యేకంగా పిఎన్ఎం మహిళా స్కూల్ మరియు మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశాం.
నా హయాంలో రెండు మున్సిపల్ కళాశాలను ఏర్పాటు చేయటం ఎంతో సంతృప్తినిస్తుంది.
కళాశాలలు ఏర్పాటు చేసినప్పుడు నారాయణ విద్యాసంస్థల నుండి ఫ్రీ మెటీరియల్ ఫ్రీ లెక్చరర్స్ వచ్చేవారు. తిరిగి అదే విధంగా చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా నారాయణను కోరుతున్నా.
కార్యక్రమంలో డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ హైఫా,కళాశాలల ఇంచార్జ్ రాజేంద్ర, జాఫర్ షరీఫ్, నన్నేసాహెబ్, దర్శి హరికృష్ణ, ఏడుకొండలు, శ్రీలక్ష్మి, శ్రీదేవి, ఉస్మాన్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు